మోహన్ లాల్ హ్యాపీ అంటున్న నిర్మాత
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన `పులి మురుగన్` చిత్రం మలయాళంలో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులో సింధూర పువ్వు, సాహసఘట్టం వంటి చిత్రాలను అందించిన నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి మన్యం పులి పేరుతో తెలుగులో డిసెంబర్ 2న విడుదల చేశారు. ఈ సినిమా తొలిరోజున హిట్ టాక్‌ను సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందని నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి తెలియజేశారు.
శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సింధూర పువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ...మన్యంపులి సినిమా ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ లో మంచి ఆదరణ పొందుతుంది. అన్నీ వర్గాల ప్రేక్షకులు సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉందంటున్నారు. బాహుబలి తర్వాత ఓ మంచి సినిమా చూశామంటున్నారు. ఇక మోహన్‌లాల్‌గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నీ ఎమోషన్స్‌ను చక్కగా పలికించారు. మాస్, యాక్షన్, ఎమోషన్స్ అన్నింటిలో అద్భుతంగా నటించారు. రీసెంట్గా సినిమాను చూసిన వెంకేష్, సురేష్‌బాబు, మహేష్‌బాబు సినిమా చూసి బావుందన్నారు. మనం కూడా హాలీవుడ్ సినిమాలు తీయవచ్చునని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఆదివారం, సోమవారం కలెక్షన్స్ పెరుగుతాయనుకుంటున్నామని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com