పైరసీ దోషులపై నిర్మాత స్పందన....
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ బుధవారం విడుదలై బాక్సాఫీస్ సందడి చేస్తున్న సినిమా `గీత గోవిందం`. మూడు రోజుల్లో 34 కోట్ల రూపాయల గ్రాస్.. 20 కోట్ల షేర్‌తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళుతుంది. అంతా బాగానే ఉన్న ఈ సినిమా రిలీజ్ ముందు నిర్మాతలకు చాలా టెన్షన్ రేపింది. అందుకు కారణం.. సినిమా లీక్ కావడమే. అయితే వెంటనే నిర్మాతలు కంప్లైంట్ ఇవ్వడం.. దానిపై పోలీసులు స్పందించి ఢిల్లీ స్థాయిలో చర్యలు చేపట్టడంతో దోషులు వెంటనే పట్టుబడ్డారు.
ఆశ్చర్యకరంగా ఇందులో గుంటూరుకి చెందిన విద్యార్థులు కూడా ఉండటం గమనార్హం. సినిమా సక్సెస్ అయింది కదా.. మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు.. కేసుపై సాఫ్ట్ కార్నర్‌తో ఆలోచిస్తారా? అని నిర్మాత బన్నివాస్ను ప్రశ్నిస్తే.. పైరసీ కాకుండా దొంగతనం చట్టం క్రింద పోలీసులు కేసు నమోదు చేశారట. దోషులను రెండు గ్రూపులుగా విడదీశారు. కావాలని సినిమాను లీక్ చేసిన వారందరినీ ఎ గ్రూపులో.. తెలియక.. అనుకోకుండా సపోర్ట్ చేసిన విద్యార్థులను బి గ్రూపులో ఉంచారట. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా.. బి గ్రూపుపై కాస్త మెత్తగానే పోలీసులు వ్యవహరిస్తారని.. అయితే ఏ గ్రూపుపై సివియర్ యాక్షన్ తీసుకుంటారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout