డైరెక్టర్ దేవాకట్ట వ్యాఖ్యలపై స్పందించిన నిర్మాత
Send us your feedback to audioarticles@vaarta.com
‘ప్రస్థానం’తో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించిన దేవా కట్ట నేడు ట్విట్టర్ వేదికగా ఓ సంచలనానికి తెరదీసిన విషయం తెలిసిందే. తాను రాసిన కథను దొంగిలించి సినిమా తీసిన ఓ వ్యక్తి డిజాస్టర్‌ను చవిచూశారంటూ ఓ నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారడంతో తాజాగా సదరు నిర్మాత విష్ణువర్దన్ ఇందూరి తెలిపారు. తానే ఎన్టీఆర్ బయోపిక్ ఐడియాను దేవాకట్టతో చర్చించాను తప్ప ఆయనెప్పడూ ఎన్టీఆర్ స్క్రిప్ట్‌తో తనను కలిసింది లేదని.. దాని గురించి మాట్లాడిందీ లేదని వెల్లడించారు.
‘‘నేను ప్రతి ఒక్కరికీ ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. 2015 డిసెంబర్‌లో నేను సెలక్ట్ చేసుకున్న రీమేక్ విషయమై దేవ కట్టాను తొలిసారిగా కలిశాను. అలాగే నేను ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించిన ఐడియాను బేసిక్ స్క్రీన్‌ప్లేతో ఆయనకు వివరించాను. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో నా ఆలోచనను దేవా కట్ట ఇష్టపడ్డారు. అలాగే నేను ఒక విషయాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను.. ఆయన ఎప్పుడూ ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించిన ఏ విషయాన్ని కూడా నాకు వివరించింది లేదు’’ అని విష్ణువర్దన్ ఇందూరి స్పష్టం చేశారు.
కాగా.. దీనికి ముందు దేవా కట్టా ట్విట్టర్‌లో.. ‘‘ప్రారంభంలో నేను రాసిన ఓ కథను దొంగలించి సినిమా చేసిన ఓ వ్యక్తి.. దాంతో డిజాస్టర్‌ను చవిచూశాడు. కానీ ఈసారి నేను అలా కానివ్వను. 2017లో చంద్రబాబు నాయుడుగారు, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిగారి పొలిటికల్ జీవితాలను ఆధారంగా చేసుకుని వారి మధ్య స్నేహం, రాజకీయ వైరం అనే అంశాలతో ఫిక్షనల్‌గా ఓ కథను డెవలప్ చేశాను. ఆ కథను రిజిష్టర్ కూడా చేయించాను. 2017లో ఈ కథను బేస్ చేసుకుని పలు వెర్షన్‌ను కూడా తయారు చేసి రిజిష్టర్ చేయించాను. కొందరు నా ఆలోచనను కాపీకొట్టారు. వారు లీగల్ సమస్యలను ఫేస్ చేయగలరని చెప్పగలను. నేను ఈ స్క్రిప్ట్‌ను మూడు భాగాలుగా చేశాను. హాలీవుడ్ మూవీ గాడ్‌ఫాదర్ సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని రాసుకున్నాను. తర్వాత దీన్ని వెబ్ సిరీస్‌గా మార్చుకున్నాను. మా టీమ్ కొన్ని మేజర్ ఓటీటీలను కలిసి ఐడియా చెప్పారు. మా లీగల్ టీమ్ ఈ వ్యవహరాన్ని గమనిస్తున్నారు’’ అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout