చిన్మయి కెరీర్‌ను నాశనం చేస్తా - నిర్మాత రాజన్
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాది మీ టూ ఉద్యమాన్ని సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి లీడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈమె ఏకంగా స్టార్ లిరిక్ రైటర్ వైరముత్తు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపించి సంచలనం క్రియేట్ చేశారు. మీ టూ ఉద్యమంలో ఇదో పెద్ద చర్చకు దారి తీసింది. రీసెంట్‌గా ఓ సందర్భంలో చిన్మయి తనకు వైరముత్తు కనిపిస్తే.. ఈసారి చెంప చెల్లుమనిపిస్తానని కూడా అన్నారు. చిన్మయి ఇలా వ్యాఖ్యానించడం చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా.. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మాత రాజన్ చిన్మయి చీప్ పబ్లిసిటీ కోసం తప్పుడు ఆరోపణలు చేస్తుందని, ఆమె కెరీర్‌ను నాశనం చేస్తానంటూ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డారు.
దాంతో అందరూ షాకయ్యరు. అయితే తర్వాత స్టేజ్ పైకి వెళ్లిన దర్శకుడు పా.రంజిత్ నటీమణులు, మహిళా ఆర్టిస్ట్‌లపై జరుగుతున్న అక్రమాలను చిత్ర పరిశ్రమ గుర్తించి నిందితులకు సరైన బుద్ధి చెప్పాలే కానీ విషయాన్ని బయట పెట్టిన వారిని బెదిరించకూడదంటూ రాజన్‌ను హెచ్చరించారు.
చిన్మయి .. వైరముత్తుపై మీ టూ ఉద్యమంలో ఆరోపణలు చేయగానే.. డబ్బింగ్ యూనియన్ నుండి ఆమెను తొలగించారు. వైరముత్తుపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో చిన్మయి మేనకాగాంధీ సహాయం తీసుకున్నారు. కేసును పరిశీలించి న్యాయం చేస్తానని మేనకాగాంధీ చిన్మయికి హామినచ్చారు కూడా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com