మహేష్ బాబు బ్రహ్మోత్సవం ప్లాప్ తో నేను నేర్చుకున్నది అదే..! నిర్మాత పి.వి.పి
- IndiaGlitz, [Saturday,October 29 2016]
బలుపు, విశ్వరూపం, సైజ్ జీరో, క్షణం, ఊపిరి, బ్రహ్మోత్సవం...ఇలా విభిన్న కథా చిత్రాలను నిర్మించిన భారీ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా. ఈ భారీ నిర్మాణ సంస్థ తాజాగా నిర్మించిన చిత్రం కాష్మోరా. కార్తి, నయనతార, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా నటించిన కాష్మోరా చిత్రాన్ని గోకుల్ తెరకెక్కించారు. దీపావళి కానుకగా రిలీజైన కాష్మోరా తెలుగు, తమిళ్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా కాష్మోరా గురించి, తదుపరి చిత్రాల గురించి భారీ చిత్రాల నిర్మాత పి.వి.పి తో స్పెషల్ ఇంటర్ వ్యూ మీకోసం..!
కాష్మోరా సినిమాకి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది..?
కాష్మోరా సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ ఆడియోన్స్ ఈ సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్డ్ డే 5 కోట్లు కలెక్ట్ చేసింది. మా అంచనాలకు తగ్గట్టు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది.
కాష్మోరా సినిమాకి అంతగా పబ్లిసిటీ చేయకపోవడానికి కారణం..?
పబ్లిసిటీ బాగా చేసి హైప్ పెంచేయడం వలన మూవీపై ఆడియోన్స్ కి ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయి. అందుచేత మీరన్నట్టుగా పబ్లిసిటీ అనేది లోఫ్రొఫైల్ లోనే చేసాం. మాకు ఫస్ట్ నుంచి ఈ మూవీ పై బాగా నమ్మకం ఉంది. అందుకనే రిలీజ్ ముందు పబ్లిసిటీ ఎక్కువుగా చేయలేదు. దీపావళి తర్వాత కార్తీ & టీమ్ తో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాం.
కాష్మోరా సినిమాలో ఆడియోన్స్ ను బాగా ఆకట్టుకుంటున్న అంశాలు ఏమిటి..?
కార్తి పెర్ ఫార్మెన్స్ ఈ మూవీకి హైలెట్. అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్ ను ఆడియోన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
రానాతో ఘాజీ మూవీ నిర్మిస్తున్నారు కదా...ప్రొగ్రెస్ ఏమిటి..?
ఇండో - పాక్ మధ్య మనకు తెలియని యుద్దం జరిగింది. అది వైజాగ్ లో జరిగింది. ఈ కథాంశంతో ఘాజీ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో రానా, తాప్సీ నటించారు. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఫిబ్రవరి 24న ఈ మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
మహేష్ తో నిర్మించిన బ్రహ్మోత్సవం ప్లాప్ అయిన తర్వాత మహేష్ మీకు మరో సినిమా చేస్తాను అన్నారు కదా..! అది ఎప్పుడు..?
అవునండి..! బ్రహ్మోత్సవం ఫ్లాప్ తర్వాత మహేష్ మా సంస్థలో సినిమా చేస్తాను అన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జూన్ లో ఈ చిత్రం ప్రారంభించనున్నాం.
బ్రహ్మోత్సవం ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏమిటి అనుకుంటున్నారు..?
భారీ సినిమాలు షూటింగ్ జరుగుతుండగానే రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తుంటారు. లాస్ట్ మినిట్ లో ఒక్కొక్కసారి రిలీజ్ డేట్ మార్చవలసి వస్తుంటుంది. అలాంటప్పుడు రిలీజ్ రేపు అనగా ఫస్ట్ కాపీ ముందు రోజు వస్తుంటుంది. ఇక అప్పుడు ఫస్ట్ కాపీ చూసి మార్పులు చేయాలి అనుకున్నా చేయలేం. ఇలాంటి పరిస్థితే బ్రహ్మోత్సవం సినిమాకి ఎదురైంది. అందుకనే బ్రహ్మోత్సవం ప్లాప్ అయ్యింది.
బ్రహ్మోత్సవం ప్లాప్ తో ఏం నేర్చుకున్నారు..?
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైమ్ కావాలి. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ దంగల్ సినిమాని రిలీజ్ కి మూడు నెలల నుంచి తన ఫ్రెండ్స్ కి, సన్నిహితులకు చూపిస్తున్నారు. ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే చేయడానికి టైమ్ ఉంటుంది. కానీ...మనకు అలా కుదరడం లేదు. అందుకనే ఘాజీ సినిమా విషయంలో అలా జరగకూడదని పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాం. షూటింగ్ ఏప్రిల్ కి పూర్తయ్యింది. మూవీని ఫిబ్రవరి 24న రిలీజ్ చేస్తున్నాం. బ్రహ్మోత్సవం ద్వారా నేను నేర్చుకున్నది అంటే ఇదే..!
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రారంభోత్సవ సభకు మీరు పూర్తి సహకారాన్ని అందించారు కదా..! మరి...జనసేన పార్టీ తరుపున పోటీ చేస్తారా..?
పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ వలన జనసేన పార్టీ సభకు సహకారాన్ని అందించాను. ఇప్పుడు నా ఆలోచన అంతా సినిమాలు వేరే బిజినెస్ మీదే. రాజకీయాల గురించి ఆలోచించడం లేదు..!
విజయవాడలో మల్టీప్లెక్స్ ఏర్పాటు చేసారు కదా..! మరి...వేరే సిటీల్లో కూడా మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తారా..?
నేను పుట్టిన ఊరు విజయవాడ. అందుచేత పుట్టిన ఊరుకి ఏదైనా చేయాలి అనే ఉద్దేశ్యంతో విజయవాడలో మల్టీప్లెక్స్ ఏర్పాటు చేసాను.
నాగార్జునతో రాజు గారి గది 2 ప్లాన్ చేస్తున్నారు కదా..! ఈ మూవీ ఎప్పుడు ప్రారంభం..?
నాగార్జున గారు హీరోగా ఓంకార్ దర్శకత్వంలో రాజు గారి గది 2 ప్లాన్ చేస్తున్నాం. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించనున్నాం. సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.