భూ వివాదంలో నిర్మాత పీవీపీ

  • IndiaGlitz, [Wednesday,June 24 2020]

విజ‌య‌వాడ వైసీపీ పార్ల‌మెంట్ అభ్య‌ర్థి, నిర్మాత‌ ప్ర‌సాద్ వి.పొట్లూరిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. అందుకు కార‌ణం భూ వివాదం. వివ‌రాల్లోకెళ్తే.. బంజారా హిల్స్ రోడ్డు నెంబ‌ర్ 14లో త‌న విల్లా ప‌క్క‌నే ఉంటున్న కైలాష్ విక్ర‌మ్ అనే వ్య‌క్తి విల్లాను నిర్మిస్తున్నాడు. ఆ విల్లాపై రూఫ్ గార్డెన్ నిర్మించుకునే ప‌నిలో విక్ర‌మ్ ఉండ‌గా పీవీపీ త‌న 40 మంది అనుచ‌రుల‌తో వ‌చ్చి దాడి చేశారంటూ బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో విక్ర‌మ్ ఫిర్యాదు చేశాడు. స్థ‌లానికి సంబంధించిన ప‌త్రాలు త‌న వ‌ద్ద‌నే ఉన్నాయని చెప్పినా పీవీపీ వినిపించుకోకుండా దాడి చేశార‌ని విక్ర‌మ్ తెలిపారు.

రెండేళ్ల క్రిత‌మే ఇంటిని కోనుగోలు చేశాం. రిజిస్ట్రేష‌న్ కూడా పూర్త‌య్యింది. త‌న ఇంటిపై రూఫ్ గార్డెన్‌ను క‌ట్టాల‌నుకుంటే కూల్చేస్తాన‌ని పీవీపీ వార్నింగ్ ఇచ్చారు. ఆరు నెల‌ల క్రితం ఫొన్లో బెదిరించారు. మంగ‌ళ‌వారం పీవీపీ మా ఇంటికి వ‌చ్చి వార్నింగ్ కూడా ఇచ్చారు. నా ఇంట్లో నేను ఏమైనా చేసుకుంటాను అని అన‌డంతో బుధ‌వారం త‌న అనుచ‌రుల‌తో వ‌చ్చి దాడి చేశారు. ఇంట్లోకి వ‌చ్చి రూఫ్ గార్డెన్‌ను కూల్చ‌య‌డం ప్రారంభించారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాను. నేను రూఫ్ గార్డెన్‌ను క‌డితే నా ఇంటి వెనుక ఉన్న పీవీపీ ఇల్లు క‌న‌ప‌డ‌ద‌ని భావిస్తున్నారు’’ అని విక్రమ్ తెలిపారు. ఇరు వర్గాల వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు విచారిస్తున్నారు.

More News

త‌మ‌న్నా ఓటీటీ డీల్‌..!

ప‌దిహేనేళ్లుగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న అందం, అభిన‌యాల‌తో అల‌రిస్తోన్న హీరోయిన్ త‌మ‌న్నా.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విషాదం.. గుండెపోటుతో రిజిస్ట్రార్ జనరల్ మృతి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు విషాదం చోటు చేసుకుంది.

చిరు ‘లూసిఫ‌ర్‌’లో రానా..?

`బాహుబ‌లి`, `నేనే రాజు నేనే మంత్రి` వంటి వైవిధ్యమైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన  యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి ఆరోగ్య కార‌ణాల‌తో కొన్ని రోజుల పాటు విశ్రాంతిని తీసుకున్నాడు.

మళ్లీ షూటింగ్స్‌కు బ్రేకులు

క‌రోనా దెబ్బ‌కు అన్నీ వ్య‌వ‌స్థ‌లు స్థ‌బ్దుగా మారాయి. ఘోరంగా దెబ్బ తిన్న రంగాల్లో సినిమా, టీవీ రంగాలు వ‌చ్చి చేరాయి.

బిత్తిరి సత్తిని టీవీ9 తొలగించిందా? లేదంటే ‘బిగ్‌బాస్’ కారణమా?

ఇటీవలి కాలంలో వీ6 ఛానల్ నుంచి బయటకు వచ్చి వార్తల్లో నిలిచిన బిత్తిరిసత్తి అలియాస్ చేవెళ్ల రవి మరోసారి చర్చనీయాంశంగా మారాడు.