‘జాతిరత్నాలు’ నిర్మాతకు ఎంత లాభం తెచ్చిపెట్టిందంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్డౌన్ తర్వాత మరీ ముఖ్యంగా చెప్పాలంటే మార్చి నెలలో ప్రేక్షకులను ఓ రేంజ్లో అలరించిన చిత్రం ‘జాతిరత్నాలు’. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. జనాలు కరోనా భయాన్ని వీడి పూర్తి స్థాయిలో బయటకు వచ్చి ఒక చిత్రాన్ని చూశారంటే.. అది ఈ సినిమానే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. నిర్మాతలు తమ తమ సినిమాలను ధైర్యంగా విడుదల చేసేందుకు ఈ సినిమా మార్గం చూపించిందనే చెప్పాలి. ఈ చిత్రం నేటి(ఆదివారం) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉండనుంది.
ఈ సినిమాను బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టి నిర్మాతలపై వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా క్లోజింగ్ వసూళ్లు షాకింగ్ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలుపుకుని రూ.10 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. ఇక రిలీజైన తొలి రోజు నుంచే మంచి టాక్ రావడంతో కొద్ది రోజులపాటు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. థియేట్రికల్ బిజినెస్ రూ.10 కోట్ల పైమాటే ఉండటంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పదకొండున్నర కోట్లుగా నమోదైంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.39 కోట్లకు పైమాటే వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ఇరవై ఏడున్నర కోట్ల లాభాలను అందుకుంది.
‘జాతిరత్నాలు’ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
నైజాం రూ.16.18 కోట్లు
సీడెడ్ రూ.4.10 కోట్లు
ఈస్ట్ రూ.1.92 కోట్లు
వెస్ట్ రూ.1.58 కోట్లు,
కృష్ణా రూ.1.81కోట్లు
గుంటూరు రూ.2.08 కోట్లు
నెల్లూరు రూ.92 లక్షలు
ఏపీ+తెలంగాణ రూ. 32.59 కోట్లు షేర్, రూ.52 కోట్ల గ్రాస్
వరల్డ్ వైడ్ రూ.39.04 కోట్ల షేర్, రూ.70 కోట్ల గ్రాస్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments