Salaar:'సలార్' పైరసీపై నిర్మాతల జాగ్రత్తలు.. అభిమానులకు రిక్వెస్ట్..

  • IndiaGlitz, [Friday,December 22 2023]

రెబల్ స్టార్ అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం.. నేడు పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ థియేటర్స్ వద్ద సినిమా సందడి మొదలైపోయింది. ప్రభాస్ నుంచి ఒక మాస్ బొమ్మ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు.. అరిరిపోయే మాస్ ఎంటర్టైనర్ దొరికినట్లు చెబుతున్నారు. దీంతో థియేటర్స్ వద్ద రెబల్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. కచ్చితంగా రూ.1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిర్మాతలు పైరసీ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో అభిమానులను ఓ రిక్వెస్ట్ చేశారు. సలార్‌ మూవీకి సంబంధించిన పైరసీ ఎక్కడైనా కనిపిస్తే తమ యాంటీ పైరసీ టీంకి తెలియజేయాలని కోరారు. ట్విట్టర్‌ ఎక్స్(X) లో సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సీన్స్ ఎవరైనా పోస్ట్ చేసినా.. మీరు పైరసీ కంటెంట్ చూసినా.. X@BLOCKXTECHS అంటూ రీ ట్వీట్ చేయాలన్నారు. అలాగే ఏదైనా పైరసీ సైట్స్‌లో సలార్ మూవీ లేదా సినిమాకి సంబంధించిన ఏ విషయం కనిపించినా.. REPORT@BLOCKXTECH.COM అనే మెయిల్‌కి మెసేజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు పలువురు టాలీవుడ్ యువ హీరోలు కూడా థియేటర్లకు వెళ్లి బెనిఫిట్‌ షో చూశారు. హీరోలు నిఖిల్, శ్రీవిష్ణు సలార్ సినిమాని వీక్షించారు. సలార్ మాన్‌స్టర్ హిట్ అంటూ నిఖిల్ ట్వీట్ చేశారు. ప్రభాస్ అన్నకు మరో బ్లాకబాస్టర్ పడిందని.. సినిమా తప్పకుండా చూడాలని తెలిపారు. ఇక శ్రీవిష్ణు అయితే అభిమానులతో కలిసి థియేటర్‌లో రచ్చ రచ్చ చేశారు. విజిల్స్ వేస్తూ అభిమానులో కలిసి హంగామా చేశారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి సరైన మాస్ బొమ్మ రావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు.

More News

Sankranti:సంక్రాంతికి ఊరు వెళ్లేవారికి శుభవార్త.. 20 ప్రత్యేక రైళ్లు..

తెలుగు ప్రజలకు పెద్ద పండుగైన సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు.

Prabhas:ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటున్న ఫ్యాన్స్.. బ్లాక్‌బాస్టర్‌గా సలార్..!

బాహుబలి సిరీస్‌తో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రపంచవ్యాప్తంగా అభిమానులను దక్కించుకున్నారు.

YS Jagan:అంగన్‌వాడీ వర్కర్లకు వైయస్ జగన్ ప్రభుత్వం శుభవార్త

అంగన్‌వాడీ వర్కర్లకు సీఎం జగన్ ప్రభుత్వం శుభవార్త అందించింది. తమ డిమాండ్లు నెరవేర్చాలని పది రోజులుగా

Gokul Chat:'గోకుల్‌ చాట్' అధినేత కన్నుమూత.. కోఠిలో విషాదఛాయలు.

హైదరాబాద్‌లోని 'గోకుల్‌ చాట్' గురించి తెలియని వారుండరూ అంటే అతిశయోక్తి కాదు. దేశంలోని ప్రఖ్యాతిగాంచింది.

Raghava Reddy:మాస్ అండ్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న ‘రాఘవ రెడ్డి’... ఆకట్టుకుంటోన్న ట్రైలర్

శివ కంఠనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో