బ్రూస్ లీ ఆడియో డేట్ ఫిక్స్..

  • IndiaGlitz, [Saturday,September 19 2015]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ఈచిత్రాన్ని శ్రీను వైట్ల తెర‌కెక్కిస్తున్నారు.ఈ సినిమాని దాన‌య్య ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. దాదాపు 20 నిమిషాలు క‌నిపించి క‌నువిందు చేయ‌నున్నార‌ట చిరు. దీంతో బ్రూస్ లీ చిత్రం పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. బ్రూస్ లీ ఆడియో రిలీజ్ ను ఈనెల 26న చేయ‌నున్న‌ట్టు ప్రచారం జ‌రిగింది. కానీ..తాజాగా అందిన స‌మాచారం అక్టోబ‌ర్ 2న బ్రూస్ లీ ఆడియో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా క‌న్ ఫ‌ర్మ్ చేసారు. మెగా హీరోలు పాల్గొనే ఈ ఆడియో వేడుక‌ను చాలా గ్రాండ్ గా..వెరైటీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. బ్రూస్ లీ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 16న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

'కేటుగాడు' చిత్రాన్నిసక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ - నిర్మాత వెంకటేష్ బాలసాని

తేజస్,చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'కేటుగాడు'.

రుద్ర‌మ‌దేవి ఈసారి ఫిక్స్

అందాల తార అనుష్క టైటిల్ రోల్ పోషించిన చిత్రం రుద్ర‌మ‌దేవి. ఈ చిత్రాన్ని గుణ‌శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు.

ముస్తాబవుతున్న 'వెన్నెల్లో హాయ్ హాయ్'

సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ అనే పేరును ఖరారు చేశారు.

నారా రోహిత్ సినిమాలో నంద‌మూరి హీరో..

నారా రోహిత్ వినాయ‌క చ‌వితి రోజు రెండు సినిమాలు ప్రారంభించాడు. అందులో ఒక‌టి అస‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో జ్యోఅచ్చుతానంద చిత్రం మ‌రొక‌టి నూత‌న ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ తెర‌కెక్కించే చిత్రం.

ప‌వ‌న్, మ‌హేష్ కోసం క‌థ‌ రెడీ అంటున్న యంగ్ డైరెక్ట‌ర్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్‌..వీరిద్ద‌రి కోసం క‌థ‌లు రెడీ చేసానంటున్నాడు ఓ యంగ్ డైరెక్ట‌ర్. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు మారుతి.