'పులి' చిత్రానికి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది - నిర్మాత సి.శోభ
Send us your feedback to audioarticles@vaarta.com
ఇళయదళపతి విజయ్ హీరోగా ఎస్.కె.టి. స్టూడియోస్ పతాకంపై చింబుదేవన్ దర్శకత్వంలో చింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి. స్టూడియోస్ పతాకంపై సిబు థమీన్స్, పి.టి.సెల్వకుమార్ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన భారీ చిత్రం 'పులి'. ఈ చిత్రాన్ని ఎస్.వి.ఆర్.మీడియా ప్రై.లి.బ్యానర్‌పై సి.శోభ తెలుగులో విడుదల చేశారు. అక్టోబర్ 1న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల ఒకరోజు ఆలస్యంగా అక్టోబర్ 2న విడుదలైంది. అక్టోబర్ 2 సాయంత్రం 6 గంటల నుంచి తెలుగ వెర్షన్ తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రదర్శింపబడుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత సి.శోభ మాట్లాడుతూ - ''ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి తెలుగు వెర్షన్ ప్రదర్శింపబడుతోంది. అన్ని ఏరియాల్లో భారీ ఓపెనింగ్స్‌తో మా సినిమా స్టార్ట్ అయింది. అన్ని ఏరియాల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వేల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. విజయ్ పెర్‌ఫార్మెన్స్, శృతిహాసన్, హన్సికల గ్లామర్, శ్రీదేవి, సుదీప్‌ల క్యారెక్టర్స్ సినిమాకి హైలైట్ అయ్యాయి. ఫస్ట్ షోకి వచ్చిన టాక్‌తో రేపటి నుంచి థియేటర్స్‌కి హెవీ క్రౌడ్ వుంటుందని బయ్యర్స్, ఎగ్జిబిటర్స్ చెప్తున్నారు. మా ఎస్.వి.ఆర్. మీడియా బేనర్‌లో మరో సూపర్‌హిట్ చిత్రంగా 'పులి' అందర్నీ ఎంటర్‌టైన్ చెయ్యడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments