నవీన్ పొలిశెట్టికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన నిర్మాత!

  • IndiaGlitz, [Monday,April 12 2021]

గతంలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’గా వచ్చి నవీన్ పొలిశెట్టి తనకంటూ ఇండస్ట్రీలో ఓ బెంచ్ మార్కును క్రియేట్ చేసుకున్నాడు. ఇక తాజాగా వచ్చిన ‘జాతిరత్నాలు’తో తన రేంజే మారిపోయింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ఒకరకంగా స్టార్ హీరోల లిస్ట్‌లో నవీన్ పొలిశెట్టి చేరిపోయాడు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నిర్మాతపై వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో నవీన్ పొలిశెట్టి డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీంతో ఈ యంగ్ హీరోతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

ఇక ‘జాతిరత్నాలు’తో నవీన్ పొలిశెట్టి రెమ్యునరేషన్ పరంగా కూడా చాలా మార్పులొచ్చాయని సమాచారం. భారీ రెమ్యునరేషన్‌ ఇస్తామంటూ నిర్మాతలు నవీన్ పొలిశెట్టిని కలుస్తున్నారట.
నవీన్‌ యాక్టింగ్‌లో కొత్తదనం చూసి ముచ్చటపడిన ఓ బడా నిర్మాత.. అతనికి భారీ పారితోషికం ఇచ్చేందుకు రెడీ అయ్యారని టాలీవుడ్ టాక్. నవీన్‌ తదుపరి చిత్రం తమ బ్యానర్‌లో చేస్తే.. రూ.5 కోట్ల రెమ్యునరేషన్‌ ఇస్తానని ఆఫర్‌ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే నవీన్‌ పొలిశెట్టి మాత్రం ఇంతవరకూ ఏ సినిమాను అధికారికంగా ఒప్పుకోలేదని సమాచారం. రెమ్యునరేషన్ కోసం ఏ సినిమా పడితే ఆ సినిమా అంగీకరించకూడదని.. నచ్చిన కథ దొరికితేనే సినిమా చేద్దామని వేచిచూస్తున్నాడని టాక్.