తెలుగు »
Cinema News »
మా బ్యానర్ కు ఉన్న పేరుకు తగ్గట్టు..మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రం ఇంకేంటి నువ్వే చెప్పు - నిర్మాత మళ్ళ విజయ ప్రసాద్
మా బ్యానర్ కు ఉన్న పేరుకు తగ్గట్టు..మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రం ఇంకేంటి నువ్వే చెప్పు - నిర్మాత మళ్ళ విజయ ప్రసాద్
Sunday, December 11, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కుటుంబ చిత్రాలకు పెట్టింది పేరు వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఈ బ్యానర్ ఇప్పుడు ఇంకేంటి నువ్వే చెప్పు అంటూ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కొత్త టాలెంట్ ను సినీ పరిశ్రమకు పరిచయం చేయడంలో వెల్ఫేర్ క్రియేషన్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఓ కొత్త దర్శకునికి, ఒక కొత్త సంగీత దర్శకునికి అవకాశం కల్పిస్తూ, నూతన నటీనటులతో డాక్టర్ మళ్ల విజయ్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్ర ఆడియో ఈనెల 10 సాయంత్రం వైజాగ్ ఆర్కే బీచ్ లో అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సుమన్ మాట్లాడుతూ, విశాఖ సాగర తీరాన ఇలా ఈ కార్యక్రమం నిర్వహించడం, చాలా సంతోషంగా ఉందని.. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.
ప్రొఫెసర్ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ.... నిర్మాత విజయ్ ప్రసాద్ నాకు బాగా తెలుసు. ఆయన ప్రేక్షకులకు అందించిన సినిమాలన్నీ ఎంతో పెద్ద విజయాన్ని సాధించాయి. ఈ చిత్రం కూడా అలాంటి విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా అన్నారు.
హీరోయిన్ అక్ఛిత మాట్లాడుతూ... తనతో పనిచేసిన నటీనటులకు, తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు.
హీరో సన్ని మాట్లాడుతూ... ఈ సినిమా తప్పకుండా తనకు మంచి భవిష్యత్ ను ఇస్తుందని, తనకు అవకాశమిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. వికాస్ అందించిన సంగీతం ఈ సినిమాకు కీలకమని చెప్పారు.
మరో హీరో ప్రశాంత్ మాట్లాడుతూ.... వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన అన్ని సినిమాల లాగానే ఈ సినిమా కూడా ఉంటుందన్నారు. సాగర్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అవుతుందన్నారు.
హీరోయిన్ ప్రసన్న మాట్లాడుతూ.... వైజాగ్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు వైజాగ్ అంటే ఎంతో ఇష్టమని, తనకు ప్రతీ ఒక్క నటీనటులు సహకరించారని చెప్పారు.
సహ నిర్మాత విధ్యార్థి వెoకట్రావ్ మాట్లాడుతూ.... ఈ సినిమాకు ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలంటే, రైల్వే కృష్ణ గారికి చెప్పాలి.ఆయన ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు.
డైరక్టర్ శివశ్రీ మాట్లాడుతూ.... ప్రొడ్యూసర్ ఈ సినిమాకు కావాల్సిన ప్రతీ దాన్ని చాలా చక్కగా సమకూర్చారు. ఆయన ప్రతీ ఒక్కరికీ బంధువు. సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఎంతో కష్టపడ్డారు.ఇప్పటి వరకు నా షార్ట్ ఫిల్మ్స్ ను ఆదరించిన ప్రతీ ఒక్కరికీ స్పెషల్ థ్యాంక్స్ అన్నారు.
సంగీత దర్శకుడు వికాస్ మాట్లాడుతూ..... తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వెల్ఫేర్ క్రియేషన్స్ కు ఎంతో ఋణపడి ఉంటాన్నారు. ఆడియో ను ఇంత బాగా ఆదరించినందుకు సంతోషమన్నారు. సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
నిర్మాత మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ.... మంచి సినిమాలను నిర్మించేదిగా పేరున్న తమ బ్యానర్ విలువ తగ్గకుండా ఈ సినిమా ఉంటుందన్నారు. ఆడియో లాగానే ఈ సినిమా ను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు. సినిమా మొదలు పెట్టిన దగ్గరి నుంచి ఏ ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడి చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ, ఈ సినిమా మీద నమ్మకంతో ఈనెలలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సినిమా సందేశాత్మకంగా ఉంటుంది. వికాస్ అందించిన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. సినిమాను ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటుంది అన్నారు.
కార్యక్రమంలో హీరో హీరోయిన్స్ వెల్ఫేర్ గ్రూప్ ఆప్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మళ్ల అరుణ కుమారి, అలేఖ్య, ఆళ్ల శ్రీనివాస్,లైన్ ప్రొడ్యుసర్ అజయ్ వర్మ, రమేష్, శేషులతో పాటు సినిమాకు పని చేసిన సాంకేతిక వర్గం, నటీనటులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పలు సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలు వైజాగ్ వాసులను ఎంతో ఆకట్టుకున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments