నంది అవార్డులపై స్పందించిన నిర్మాత మల్కాపురం శివకుమార్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల ప్రకటించిన మూడు సంవత్సరాల నంది అవార్డులు పచ్చపార్టీ తమ కార్యకర్తలకు కండువాలను కప్పినట్లుగా కప్పింది. అవార్డులకు అర్హత వున్న చిత్రాలను విస్మరించి తమకు అనుకూలంగా వున్న వారికే అవార్డులను పంచిపెట్టింది అంటున్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్.
భద్రాద్రి, సూర్యవర్సెస్ సూర్య, శౌర్య, శింగం-3 చిత్రాలతో నిర్మాతగా అందరికి సుపరిచితుడైన మల్కాపురం శివకుమార్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల గురించి మాట్లాడుతూ మూడు సంవత్సరాల నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం తమకు అనుకూలమైన వారికి మిఠాయిలను పంచిపెట్టినట్టుగా పంచిపెట్టింది. ఎంతో వ్యయప్రయాసలతో నిర్మించిన సినిమాలను విస్మరించింది.
2015లో సరికొత్త కాన్సెప్ట్‌తో నిఖల్ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో నేను నిర్మించిన సూర్య వర్సెస్ సూర్య అత్యంత ప్రజాదరణ పొందిన వినూత్నంగా చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఇలాంటి కాన్సెప్ట్‌తో అత్యధిక బడ్జెట్‌తో హాలీవుడ్‌లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలాంటి కొత్త ప్రయత్నానికి ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డు రాకపోవడం విచారకరం.
హాలీవుడ్ వాళ్లకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన తెలుగు సినిమా నంది అవార్డు కమిటీకి కనిపించలేదా? అసలు ఈ అవార్డులు తెలుగుదేశం ప్రభుత్వం తరపున ఇచ్చిన అవార్డులా అనిపిస్తున్నాయి.ఇవి ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ తరపున ఇస్తే బాగుండేది. అసలైన చిత్రాలకు నంది అవార్డులు ఇవ్వకుండా.. తమకు నచ్చిన వారికి అవార్డులు ఇవ్వడం సరికాదు అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments