అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ ఫెర్‌ఫార్మెన్స్ ఫిల్మ్ గా నిలుస్తుంది - నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌

  • IndiaGlitz, [Friday,April 27 2018]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యు ఏ స‌ర్టిఫికేట్ తో మే 4 న సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..... మా చిత్రం నాపేరు సూర్య- నా ఇల్లు ఇండియా చిత్రానికి మెద‌టినుండి పాజిటివ్ బ‌జ్ వ‌స్తుంది. ప్ర‌తి భార‌తీయుడు ఇది నా చిత్రం అని కాల‌ర్ ఎత్తుకుని చెప్పె చిత్రం గా ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో నిలుస్తుంది. మెము రిలీజ్ చేసిన ఫ‌స్ట్ ఇంపాక్ట్ లో చ‌చ్చిపోతా.. బోర్డ‌ర్ లో అనే డైలాగ్ కానివ్వండి.. అన్ని ఇండియాలు లేవురా ఓక్క‌టే ఇండియా అనే డైలాగ్ కానివ్వండి రొమాలు నిక్క‌బొడుచుకునేలా వున్నాయి.

మా చిత్రం ఏంటో ఇవి చూస్తే అర్ద‌మ‌వుతుంది.  అంద‌ర్లో ఈ చిత్రం చూడాల‌నే ఆశ‌క్తి డ‌బుల‌వుతుంది. ఈచిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ట్రేడ్ లో ఇప్ప‌టికే బ‌జ్ చాలా హై రేంజి లో వుండ‌టం చాలా ఆనందంగా వుంది. ఈ స‌మ్మ‌ర్‌ మెగా అభిమానుల‌కు పండ‌గ‌ని చెప్పాలి..ఈచిత్రం లో అల్లు అర్జున్ సైనికుడి పాత్ర కోసం ప్రత్యేకంగా తనను తాను మలచుకున్న విధానం గూజ్ బంప్స్ . బ‌న్ని ఫెర్‌పార్మెన్స్ త‌న కెరీర్ లో బెస్ట్ అని గ‌ర్వంగా చెబుతున్నాను.

అలాగే స‌ర్‌ప్రైజ్ డాన్స్ లు కూడా వుంటాయి. ఈ చిత్రంలో ఇలాంటి ఎన్నో స‌ర్‌ప్రైజ్ లు వున్నాయి. అలాగే మా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ కూడా స‌ర్‌ప్రైజ‌స్ చాలా వున్నాయి.. అత్యంత భారీ ఈవెంట్ గా చేస్తున్నాము. అలాగే ఈ ఫంక్ష‌న్ కి మెగా అభిమానులు అత్యంత భారీగా హ‌జ‌ర‌వుతున్నారు. ఏప్రిల్ 29న గ్రాండ్ ఈవెంట్ గా అభిమానుల గుండెల్లో చిర‌స్థాయిగా వుంటుంది. మే 4 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ గా విడుద‌ల కానుంది.. అని అన్నారు

More News

అప్పుడు వ‌ర్మ‌.. ఇప్పుడు సందీప్ రెడ్డి

'అర్జున్ రెడ్డి'.. తెలుగునాట‌ ఈ సినిమా ఒక సంచలనం. విజయ్ దేవరకొండను యూత్ స్టార్‌గా మార్చిన చిత్రమిది. ఫస్ట్ ఫిల్మ్‌నే బోల్డ్ మూవీగా రూపొందించి.. అటు ప్రేక్షకులతో పాటు

అవార్డులు తెచ్చే పాత్ర‌ల కోసం అంజ‌లా ఆరాటం

'ప్రేమించుకుందాం రా..' (1997), 'చూడాలని వుంది' (1998), 'సమరసింహారెడ్డి'(1999) లాంటి ఇండస్ట్రీ హిట్స్‌లో నటించి లక్కీ హీరోయిన్ అనిపించుకున్నారు ఉత్త‌రాది భామ అంజ‌లా ఝ‌వేరి.

మ‌హేష్ ప్ర‌తి హిట్ చిత్రంలోనూ..

సినిమాలు విజయం సాధించడానికి కథ, కథనంతో పాటు కాంబినేషన్‌లు కూడా కీలకపాత్రలు పోషిస్తాయి.

ఈ ఏడాది నాని కంటిన్యూ చేయ‌డం లేదా?

హ్యాట్రిక్ హిట్స్‌ అందుకోవడమే అరుదైపోయిన‌ ఈ రోజుల్లో.. ఏకంగా డబుల్ హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు నేచురల్ స్టార్ నాని

రామ్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స్ర‌వంతి మూవీస్ చిత్రం ప్రారంభం

కొన్ని కాంబినేష‌న్లు అనూహ్యంగా తెర‌మీద‌కు వ‌స్తాయి. వ‌చ్చినంత  వేగంగానే ఆస‌క్తిని  రేకెత్తిస్తుంటాయి.