ఏపీకి తెలుగు చిత్ర పరిశ్రమ.. తెరపైకి మరో డిమాండ్, కర్నూలుని మూవీ హబ్‌ చేయాలన్న కేఎస్ రామారావు

  • IndiaGlitz, [Wednesday,March 30 2022]

తెలుగు నేల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కేంద్రంగా హైదరాబాద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రపదేశ్‌‌లో కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాలు జరపాలని ఇక్కడి ప్రభుత్వం కోరుతోంది. గతంలో తెలుగుదేశం ఇప్పుడు వైసీపీ ముఖ్యమంత్రులు ఈ దిశగా చర్యలు చేపట్టాయి. కొద్దిరోజుల క్రితం సినిమా టికెట్ల వ్యవహారంపై తనను కలిసేందుకు వచ్చిన సినీ ప్రముఖులతో సీఎం జగన్ ఈ మేరకు కదిలించారు కూడా.

చిత్ర పరిశ్రమకు విశాఖ అన్ని విధాలుగా అనుకూలంగా వుంటుందని.. అక్కడ కూడా జూబ్లిహిల్స్ లాంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేద్దామన్నారు. అటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఏపీలోనూ తెలుగు చిత్ర పరిశ్రమ వుండాలనే అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు స్పందించారు. ఇటీవల ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకు సీఎం వైఎస్ జగన్ ఎంతో సహకారం అందించారని ప్రశంసించారు. అంతేకాదు పెద్ద, చిన్న సినిమాలకు ఏపీ ప్రభుత్వము అండగా నిలిచిందని వ్యాఖ్యానింనచారు.

ఏపీలోని కర్నూలులో సినిమా చిత్రీకరణకు సంబందించిన అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయని రామారావు అన్నారు. కనుక కర్నూలులో సినిమా షూటింగ్, ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు దిశగా సినీ పెద్దలు ఆలోచించాలని సూచించారు. అంతేకాదు ఇదే విషయంపై ఉగాది పండుగ తరువాత ఏపీలోని ప్రభుత్వ పెద్దలను, సినీ పెద్దలను సంప్రదిస్తానని కేఎస్ రామారావు వెల్లడించారు. కర్నూలును సినిమా ఇండస్ట్రీ హబ్ గా చేసేందుకు ముందుకు వెళ్తామన్నారు. ఈ జిల్లాలో తుంగభద్ర నది, కెసి కెనాల్, సమ్మర్ స్టోరేజ్, బాలసాయి స్కూల్ అనువైన ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. అంతేకాదు కర్నూలులో 12 ఎకరాల్లో ఫిలింసిటీగా అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నామని రామారావు అన్నారు. జిల్లాలో సినిమాలు తీస్తే 20% రాయితీ లభించనున్నదని.. ఇందులో భాగంగా ఇక నుంచి కర్నూలులో సినిమా తీయాలని నిర్ణయించామని తెలిపారు.

More News

ఏపీలో భగ్గుమంటున్న సూర్యుడు.. సీమలో 40కిపైనే ఉష్ణోగ్రత, రేపు కూడా వడగాడ్పులు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారేత్తిస్తున్నాయి. ఉదయం పది గంటలకే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు.

"ముఖచిత్రం" సినిమాలో పవర్ ఫుల్ లాయర్ పాత్రలో విశ్వక్ సేన్, బర్త్ డే పోస్టర్ రిలీజ్

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "ముఖచిత్రం".

RRR రేంజ్ ప్రమోషన్ Pushpa కి చేసి ఉంటె !!

సినిమా తీసాక దానిపై జనానికి ఆసక్తి ఎలా తీసుకురావాలో తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళికి బాగా తెలుసు.

సిబ్బంది నిర్వాకం.. బ్యాంక్‌కు తాళం, 18 గంటల పాటు లాకర్‌ గదిలో వృద్ధుడి నరకయాతన

బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధుడు రాత్రంతా బ్యాంక్ లాకర్‌లో వుండాల్సి వచ్చింది. ఆయనను లోపలే వుంచి బ్యాంక్‌కు తాళం వేసి వెళ్లారు .

సురేష్ గోపీ న్యూలుక్.. ‘మీది గడ్డమా? మాస్కా?’ , రాజ్యసభలో నవ్వులు పూయించిన వెంకయ్య నాయుడు

దేశ భవితను నిర్దేశించే చట్ట సభల్లో ఇటీవలి కాలంలో వాగ్వాదాలకు, పరస్పర ఆరోపణలకు, ముష్టి యుద్ధాలకు వేదికగా నిలుస్తోంది.