నిర్మాత కొనేరు సత్యనారాయణ...రెండు సినిమాలు
Send us your feedback to audioarticles@vaarta.com
కె.ఎల్.యూనివర్సిటీ అధినేత కొనేరు సత్యనారాయణ పుట్టినరోజు నేడు (అక్టోబర్ 20). ఈ సందర్భంగా ఆయన నిర్మాణంలో రూపొందుతోన్న రెండు సినిమాల వివరాలను ఆయన ప్రకటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ `7` సినిమా మేకింగ్ చూసి నచ్చడంతో రమేశ్ వర్మతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారు. రమేశ్ వర్మ నిర్మాణ సారథ్యంలో ఎ స్టూడియోస్ పతాకంపై కొనేరు సత్యనారాయణ రెండు చిత్రాలను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిన ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఏరువాక.. ప్రేమ సాగరంలో రెండు యువ జంటలు ఏ తీరానికి చేరుకున్నాయనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రమే `ఏరువాక`. క్యూట్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రెండు యువ జంటలుగా నూతన నటీనటులు నటిస్తున్నారు. రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రమేశ్ వర్మ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
16+.... టీనేజ్‌లోని ఆరుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు కలిసి చేసే ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రమే `16+`. సాగర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రమేశ్ వర్మ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆరుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు అందరూ కొత్తవారిని ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, ఆర్ట్: గాంధీ, ఎడిటర్: అమర్, పాటలు: శ‌్రీమణి, కో డైరెక్టర్: వేణుపల్లి.
ఇద్దరు స్టార్ హీరోలతో చేయబోయే సినిమాల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు కొనేరు సత్యనారాయణ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com