నిర్మాత‌ కొనేరు స‌త్య‌నారాయ‌ణ‌...రెండు సినిమాలు 

  • IndiaGlitz, [Saturday,October 20 2018]

కె.ఎల్‌.యూనివ‌ర్సిటీ అధినేత కొనేరు స‌త్య‌నారాయ‌ణ పుట్టిన‌రోజు నేడు (అక్టోబ‌ర్ 20). ఈ సంద‌ర్భంగా ఆయ‌న నిర్మాణంలో రూపొందుతోన్న రెండు సినిమాల వివ‌రాల‌ను ఆయ‌న ప్ర‌క‌టించారు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ '7' సినిమా మేకింగ్ చూసి న‌చ్చ‌డంతో ర‌మేశ్ వ‌ర్మతో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించారు. ర‌మేశ్ వ‌ర్మ నిర్మాణ సారథ్యంలో ఎ స్టూడియోస్ ప‌తాకంపై కొనేరు స‌త్య‌నారాయ‌ణ రెండు చిత్రాల‌ను నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాదిన ఈ రెండు సినిమాలు విడుద‌లకు సిద్ధ‌మ‌వుతున్నాయి.

ఏరువాక‌.. ప్రేమ సాగ‌రంలో రెండు యువ జంట‌లు ఏ తీరానికి చేరుకున్నాయ‌నే క‌థాంశంతో రూపొందుతోన్న చిత్ర‌మే 'ఏరువాక‌'. క్యూట్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో రెండు యువ జంట‌లుగా నూత‌న న‌టీన‌టులు న‌టిస్తున్నారు. రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ర‌మేశ్ వ‌ర్మ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

16+.... టీనేజ్‌లోని ఆరుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు క‌లిసి చేసే ప్ర‌యాణంలో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేశారనే క‌థాంశంతో రూపొందుతోన్న చిత్ర‌మే '16+'. సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ర‌మేశ్ వ‌ర్మ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం చైత‌న్ భ‌ర‌ద్వాజ్‌, సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఆరుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు అంద‌రూ కొత్త‌వారిని ఈ చిత్రం ద్వారా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈ చిత్రానికి మాట‌లు: హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, ఆర్ట్‌: గాంధీ, ఎడిట‌ర్‌: అమ‌ర్‌, పాట‌లు: శ‌్రీమ‌ణి, కో డైరెక్ట‌ర్‌: వేణుప‌ల్లి.

ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో చేయ‌బోయే సినిమాల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు కొనేరు స‌త్య‌నారాయ‌ణ‌.

More News

తిత్లి తుఫాన్ బాధితుల సహాయార్థం 25 లక్షలు ప్రకటించిన - అల్లు అర్జున్

తుఫాను భీభత్సం తో అతలాకుతలం అయిన శ్రీకాకుళం ప్రాంత ప్రజల్ని ఆదుకునేందుకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చారు.

'సుబ్రహ్మణ్యపురం' టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్

సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'సుబ్రహ్మణ్యపురం'. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

కాదంబరి కిరణ్ చేతుల మీదుగా ప్రారంభమైన ప్రాఘ్నేయ ఆర్ట్ క్రియేషన్స్ చిత్రం

డి.ఎస్. రెడ్డి నిర్మాణ సారథ్యంలో గజపతి శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రాఘ్నేయ ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర ప్రారంభం హైదరాబాద్‌లో జరిగింది.

రాజకీయాల కోసం కాదు.. నిజం కోస‌మే! - వ‌ర్మ‌

వివాదస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఎట్ట‌కేల‌కు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తిరుప‌తిలో ఎట్ట‌కేల‌కు లాంచ‌నంగా క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు.

'పేట్ట' షూటింగ్ పూర్తి...

త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ 165వ చిత్రం 'పేట్ట‌'. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిస్తుంది.