టాలీవుడ్‌లో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువ నిర్మాత మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు, సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్, ఆ మరుసటి రోజే ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఆ తర్వాతి రోజు హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలు కళ్లెదుట మెదులుతుండగానే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది.
నిర్మాత జక్కుల నాగేశ్వరరావు (46) రోడ్డు ప్రమాదంలో మరణించారు. కృష్ణా జిల్లా ఉయ్యురు మండలం మంటాడలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో జక్కుల సంఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. ‘లవ్ జర్నీ’, ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ చిత్రాలకు నిర్మాత గా వ్యవహరించారు. నిర్మాత మృతి పట్ల పలువురు సీని, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments