కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న నిర్మాత
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు తెర పై మరో ప్రముఖ నిర్మాత తనయుడు కథానాయకుడిగా పలకరించనున్నారు. ఆ నిర్మాత మరెవరో కాదు.. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న డి.వి.వి.దానయ్య. ఇటీవలే భరత్ అనే నేనుతో హిట్ కొట్టిన ఈ నిర్మాత.. ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా నిర్మిస్తున్నారు.
అలాగే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారు. అంతేగాకుండా.. తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట డి.వి.వి.దానయ్య.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ని ఈ సినిమాలో హీరోయిన్గా నటింపజేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com