'పందెం కోడి' తర్వాత విశాల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ 'అభిమన్యుడు' - నిర్మాత గుజ్జల పూడి హరి
Send us your feedback to audioarticles@vaarta.com
300 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి...సక్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్నారు గుజ్జలపూడి హరి. హీరో విశాల్‌తో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ ఆయన హీరోగా నటించిన రాయుడు, ఒక్కడొచ్చాడు, డిటెక్టివ్ చిత్రాలు తర్వాత రీసెంట్‌గా విడుదలైన అభిమన్యుడు సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు నిర్మాత హరి.
రీసెంట్‌గా మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అభిమన్యుడుస. ఎం.పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందించారు. జూన్ 1న విడుదలైన ఈ సినిమాతో నిర్మాతగా చాలా పెద్ద హిట్‌ను అందుకున్నారు నిర్మాత హరి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ .. నైజాం 2.90 కోట్ల రూపాయలు, వైజాగ్ 75 లక్షలు, సీడెడ్ 68 లక్షలు, కృష్ణా 56.46 లక్షలు, గుంటూరు 53 లక్షలు, నెల్లూరు 26 లక్షలు, ఇతర ప్రాంతాలు 70 లక్షలు ... మూడు రోజుల్లో 7.10 కోట్ల రూపాయలను వసూలు చేసి విశాల్ కెరీర్‌లోనే బెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.
ఈ సందర్భంగా నిర్మాత గుజ్జలపూడి హరి మాట్లాడుతూ "సినిమా మేం ఊహించిన దాని కంటే చాలా పెద్ద హిట్ అయ్యింది. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఇదొక ఉదాహరణ. నా మిత్రులైన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. నాలుగేళ్లుగా మంచి విజయం కోసం వెయిట్ చేసిన నాకు ఈ సక్సెస్‌తో ఆనందంగా ఉంది. డిజిటల్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో సామాన్యుడు ఎదుర్కొంటున్న కష్టాలను దర్శకుడు మిత్రన్ అద్భుతంగా తెరకెక్కించారు. దాంతో సినిమాకు ప్రేక్షకులు చక్కగా కనెక్ట్ అయ్యారు.
సాధారణంగా సామాజిక బాధ్యతను ఫీలయ్యే హీరో విశాల్ నిజ జీవితంలో పాత్రకు ఈ పాత్ర చాలా దగ్గరగా ఉంది. ఆల్‌రెడీ 600 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాకు మరో 60థియేటర్స్ పెంచాం. సమంతగారు నటించిన హిట్ చిత్రాలన్నింటిని ఓ డిస్ట్రిబ్యూటర్‌గా నేను డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాను. ఇప్పుడు మరోసారి ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమా నిర్మాతగా సక్సెస్ అందుకోవడం ఆనందంగా ఉంది.
అలాగే అర్జున్ గారి క్యారెక్టర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులను వైజాగ్, రాజమండ్రి, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో యూనిట్ నేరుగా కలుసుకుని తమ ఆనందాన్ని పంచుకుంటారు. అలాగే ఈ గురువారం ఓ సక్సెస్ మీట్‌ను కూడా నిర్వహించబోతున్నాం.
సినిమా స్క్రిప్ట్ దశ నుండే నాకు తెలుసు . కాబట్టి సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇంత మంచి సినిమాను వదులుకోకూడదని విశాల్‌గారు నిర్ణయించుకుని సినిమా చేయడానికి రెడీ అయ్యారు. తన వల్ల ఎవరూ నష్టపోకూడదని ఆలోచించే హీరోల్లో విశాల్‌గారు ఉంటారు. కాబట్టి ఆయన కొత్త సబ్జెక్స్ట్‌ను రిస్క్ తీసుకునైనా తనే నిర్మిస్తారు. ఈ సినిమా కథ నచ్చగానే తన హోం బ్యానర్‌లోనే సినిమా చేయడానికి విశాల్‌గారు రెడీ అయ్యారు.
'పందెంకోడి' తర్వాత ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ 'అభిమన్యుడు' చిత్రమే. ఈ సినిమాకు సీక్వెల్ కూడా చేయాలని విశాల్‌గారు అనుకుంటున్నారు. అలాగే విశాల్‌గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేస్తారో ఇప్పుడే చెప్పలేం. అలాగే విశాల్‌గారి 25వ సినిమా 'పందెంకోడి 2' రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఓ మేజర్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తవుతుంది. దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout