అజిత్ మూవీపై క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత
Send us your feedback to audioarticles@vaarta.com
అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో నాలుగో సినిమాగా విశ్వాసం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. `వీరం, వేదాళం, వివేకం` సినిమాల తర్వాత అజిత్, శివ కాంబినేషన్లో రానున్న సినిమా. అజిత్ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఇందులో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతిని తెలిపారు.
ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. ఈసినిమాను సంక్రాంతికి విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే రజనీకాంత్ లేటెస్ట్ సినిమా `పేట్ట` సంక్రాంతికి విడుదలవుతుంది. కాబట్టి అజిత్ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అజిత్ సినిమా నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్ క్లారిటీ ఇచ్చింది. అజిత్ `విశ్వాసం` సంక్రాంతికి విడుదల కావడం ఖాయమని ప్రకటించింది. దీంతో వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద పండుగే అని చెప్పడంలో సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments