సినిమాల గురించి క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో ఈ ఏడాది మా బ్యానర్లో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ., అందులో మూడు సినిమాలు పెద్ద సక్సెస్ సాధించాయని చెప్పుకొచ్చారు నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి. క్షణం, బ్రహ్మోత్సవం, ఊపిరి, కాష్మోరా సినిమాలు విడుదలైతే బ్రహ్మోత్సవం తప్ప మిగిలిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2017లో కూడా పివిపి బ్యానర్ నుండి మంచి సినిమాలు వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో.. ఫిభ్రవరి 24న ఘాజి సినిమాను హిందీ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నాం. హిందీలో కరణ్‌జోహార్‌గారు ఘాజీ సినిమాను విడుదల చేయడం విశేషం.
ఇండియా, పాకిస్థాన్ మధ్య అండర్‌వాటర్ ఓ యుద్ధం జరిగింది. ఆ యుద్ధ నేపథ్యంలో ఘాజీ సినిమా రూపొందింది. వైజాగ్‌లో జరిగిన కథ. ఈ చిత్రంలో రానా, అతుల్‌కులకర్ణి, కె.కె.మీనన్, తాప్సీ తదితరులు ఈ చిత్రలో నటించారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఓంకార్గారితో రాజుగారి గది2 చిత్రాన్ని నాగార్జునగారు హీరోగా చేస్తున్నాం. ఊపిరి తర్వాత నాగార్జునగారితో చేయడం ఆనందంగా ఉంది. మూడో సినిమాను సూపర్‌స్టార్ మహేష్‌బాబు, వంశీపైడిపల్లితో తెలుగు, తమిళంలో సినిమా చేస్తున్నాం అంటూ ప్రసాద్ వి.పొట్లూరి తెలియజేయడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout