ఆ డైరెక్టర్ కి ఆడి కారు గిఫ్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్..!
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా సక్సెస్ అయితే...ఆ దర్శకుడికి కారు గిఫ్ట్ గా ఇస్తుంటారు కొంత మంది నిర్మాతలు, హీరోలు..! శ్రీమంతుడు సినిమా బ్లాక్ బష్టర్ అవ్వడంతో కొరటాల శివకు సూపర్ స్టార్ మహేష్ కారు గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అభినేత్రి దర్శకుడు విజయ్ కు నిర్మాత గణేష్, ప్రభుదేవాతో కలిసి ఆడి కారు గిఫ్ట్ గా ఇచ్చారు. తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం అభినేత్రి.
ఈ చిత్రాన్ని తెలుగులో కోన వెంకట్, తమిళ్ లో ప్రభుదేవాతో కలిసి గణేష్, హిందీలో సోనూసూద్ నిర్మించారు. ఈ చిత్రం సాధించిన విజయాన్ని పురస్కరించుకుని డైరెక్టర్ విజయ్ కు ఆడికారు గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ విషయాన్ని అభినేత్రి టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ...కష్టం ఫలితాన్ని ఇస్తుంది. డైరెక్టర్ విజయ్ కంగ్రాట్స్ అని తెలియచేస్తూ...ప్రభుదేవా, గణేష్ విజయ్ కి ఆడి కారు గిఫ్ట్ ఇస్తున్న ఫోటోను పోస్ట్ చేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments