ఆ డైరెక్ట‌ర్ కి ఆడి కారు గిఫ్ట్ ఇచ్చిన ప్రొడ్యూస‌ర్..!

  • IndiaGlitz, [Friday,November 04 2016]

సినిమా స‌క్సెస్ అయితే...ఆ ద‌ర్శ‌కుడికి కారు గిఫ్ట్ గా ఇస్తుంటారు కొంత మంది నిర్మాత‌లు, హీరోలు..! శ్రీమంతుడు సినిమా బ్లాక్ బ‌ష్ట‌ర్ అవ్వ‌డంతో కొర‌టాల శివ‌కు సూప‌ర్ స్టార్ మ‌హేష్ కారు గిఫ్ట్ గా ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇక ఇప్పుడు అభినేత్రి ద‌ర్శ‌కుడు విజ‌య్ కు నిర్మాత గ‌ణేష్, ప్ర‌భుదేవాతో క‌లిసి ఆడి కారు గిఫ్ట్ గా ఇచ్చారు. త‌మ‌న్నా, ప్ర‌భుదేవా, సోనూసూద్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన చిత్రం అభినేత్రి.

ఈ చిత్రాన్ని తెలుగులో కోన వెంక‌ట్, త‌మిళ్ లో ప్ర‌భుదేవాతో క‌లిసి గ‌ణేష్, హిందీలో సోనూసూద్ నిర్మించారు. ఈ చిత్రం సాధించిన విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని డైరెక్ట‌ర్ విజ‌య్ కు ఆడికారు గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ విష‌యాన్ని అభినేత్రి టీమ్ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేస్తూ...క‌ష్టం ఫ‌లితాన్ని ఇస్తుంది. డైరెక్ట‌ర్ విజ‌య్ కంగ్రాట్స్ అని తెలియ‌చేస్తూ...ప్ర‌భుదేవా, గ‌ణేష్ విజ‌య్ కి ఆడి కారు గిఫ్ట్ ఇస్తున్న ఫోటోను పోస్ట్ చేసారు.

More News

ర‌జ‌నీ మూవీని రీమేక్ చేస్తున్న లారెన్స్..!

కొరియోగ్రాఫ‌ర్ గా, హీరోగా, డైరెక్ట‌ర్ గా...ఇలా త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో విజ‌యం సాధించిన మ‌ల్టీ టాలెంటెడ్ ప‌ర్స‌న్ రాఘ‌వ లారెన్స్. కాంచ‌న‌, గంగ చిత్రాల‌తో హ‌ర్ర‌ర్ మూవీస్ లో ఓ సంచ‌ల‌నం సృష్టించిన లారెన్స్ ఇప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీ మూండ్రు ముగమ్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ప‌వ‌న్ హీరోయిన్ ని ట్రై చేస్తున్న నితిన్..!

యువ హీరో నితిన్ అ ఆ సినిమాతో భారీ విజ‌యాన్ని సాధించిన త‌ర్వాత నెక్ట్స్ మూవీ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. చాలా క‌థ‌లు విన్న‌ప్ప‌టికీ ఫైన‌ల్ గా అందాల రాక్ష‌సి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడితో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పాడు.

ఈరోజు థియేట‌ర్స్ లో న‌రుడా డోన‌రుడా..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ న‌టించిన తాజా చిత్రం న‌రుడా డోన‌రుడా. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ తెర‌కెక్కించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ఆడియోన్స్ లో ఆస‌క్తిని పెంచింది.

దువ్వాడ‌ సెట్స్ లో జ‌గ‌న్నాథ‌మ్.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది.

బోయపాటి శ్రీను, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ప్రారంభం

బెల్లంకొండ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని సినిమా కార్యాలయంలో లాంచనంగా ప్రారంభమైంది.