'ఎంతవారలైనా' మిమ్మల్ని అలరిస్తుంది - నిర్మాత జి. సీతా రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
రామదూత ఆర్ట్స్ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మిస్తున్న థ్రిల్లింగ్ హారర్ మూవీ 'ఎంతవారలైనా'. ఈ చిత్రంలో అద్వైత్, జహీదా శ్యామ్, అలోక్ జైన్, సీతారెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం హైదరాబాద్ గోల్డెన్ పార్క్ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ హంజాద్ విడుదలచేశారు. ఈ సందర్భంగా..
నిర్మాత జి. సీతారెడ్డి మాట్లాడుతూ - ''దర్శకుడు గురు చిందేపల్లి నా క్లాస్ మేట్, చిరకాల మిత్రుడు. సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో నిర్మాతనయ్యాను. గురు చిందేపల్లి చెప్పిన కథ ఎంతో నచ్చి ఈ సినిమాను చేశాం. ఈ సృష్టిలో మంచి చెడు రెండు మార్గాలు ఉంటాయి. అయితే చెడు మార్గాన్ని ఎంచుకుంటే ఎలాంటి పరిణామాల్ని అనుభవించాల్సి ఉంటుందో ఈ సినిమా చూపించాం. ఇది న్యూ జనరేషన్ హారర్ మూవీ. క్లైమాక్స్‌లో వచ్చే 20 నిమిషాలు సినిమాకే హైలెట్. గురుచిందేపల్లి నాకు 1-54 నిమిషాల కథను చెప్పి అదే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హైదరాబాద్, మైసూర్, బెంగళూరు, చిక్‌మంగళూరులోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియన్స్ నాకు చాలా సహకారాన్ని అందించారు. నాకు కూడా చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి ఉండడంతో డైరెక్టర్ ఈ సినిమాలో నాతో ఎస్.పి క్యారెక్టర్ చేయించారు. నాకు నిర్మాతగా రామానాయుడుగారు, నటుడిగా ఎస్ వి రంగారావుగారు స్ఫూర్తి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్నమా సినిమాను ఏప్రిల్‌లో కన్నడ, తెలుగు భాషల్లో విడుదలచేయబోతున్నాం'' అన్నారు.
దర్శకుడు గురు చిందేపల్లి మాట్లాడుతూ - ''ఎంతవారలైనా కాంత దాసులు కావచ్చు, కనకదాసులు కావచ్చు. కానీ, తప్పు చేసినప్పుడు ఎంతవారలైనా కూడా కచ్చితంగా శిక్షార్హులే.. అనే పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి మా ప్రొడ్యూసర్ సీతారెడ్డి గారే కారణం. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ సుక్కు. మూడు పాటలు చాలా బాగా వచ్చాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ముఖ్యంగా మా డి.ఓ.పి మురళి మోహన్ రెడ్డిగారి సహకారం మరువలేనిది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి పనిచేశారు. సినిమా ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది తప్పకుండా చూసి ఆదరించండి'' అన్నారు.
గోల్డెన్ పార్క్ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ హంజాద్ మాట్లాడుతూ - '' సీతా రెడ్డి , గురు చిందేపల్లి నా ప్రాణ మిత్రులు వారిద్దరి కాంబినేషన్లో వస్తున్న 'ఎంతవారలైనా' మూవీ తప్పకుండా విజయం సాధించాలి'' అన్నారు.
అద్వైత్, జహీదా శ్యామ్, అలోక్ జైన్, సీతారెడ్డి, స్వప్న, అలీషా, అభిలాష్, మాస్టర్ అయాన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, ఫోటోగ్రఫీ: ఎస్.మురళీమోహన్‌రెడ్డి, ఎడిటింగ్: వి.నాగిరెడ్డి, ఆర్ట్: బాబ్జీ, స్టిల్స్: ఈశ్వర్, నిర్మాత: జి.సీతారెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గురు చిందేపల్లి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com