మహేశ్ మూవీకి ప్రొడ్యూసర్ దొరికారోచ్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేశ్ బాబు 25వ సినిమా 'మహర్షి' అనంతరం.. 'ఎఫ్2' తో ఫుల్ జోష్‌లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ మూవీకి వర్కింగ్ టైటిల్ 'వాట్సప్' అని.. మరోవైపు మహేశ్ సరసన నటించేందుకు సాయిపల్లవిని తీసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్ నడుస్తోంది. అంతేకాదు ఆమెకు స్క్రిప్ట్ కూడా చదివి వినిపించారని.. కథ మొత్తం విన్న సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని పుకార్లు వస్తున్నాయి.
అన్నీ సరే సినిమాను నిర్మించేదెవరు..? అనేది మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు. అయితే ఈ సందేహానికి శివరాత్రి రోజున ఫుల్‌స్టాప్ పడిపోయింది. అనిల్ సుంకర, దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తారని స్పష్టత వచ్చేసింది. అయితే అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. త్వరలోనే ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ సినిమాలో లేడీ లీడ్‌రోల్‌లో నటించేదేవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే లేదా జూన్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. తన సినిమాలన్నీ సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావించే, సెంటిమెంట్ గా భావించే దిల్ రాజు.. మహేశ్ సినిమాను కూడా 2020 సంక్రాంతికి రిలీజ్ చేయాలని సన్నాహాలు సమాచారం.
ఇంతకీ ఆ లేడీ ఎవరు..? మూవీలో లీడ్ రోల్ ఏముంటుంది..? అసలు సినిమా టైటిల్ ఎలా ఉండబోతోంది..? ఎఫ్2 రేంజ్‌లో మహేశ్ మూవీ సక్సెస్ అవుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com