మోక్షజ్ఞ తొలి చిత్రానికి నిర్మాత ఫిక్స్..!

  • IndiaGlitz, [Friday,January 13 2017]

నంద‌మూరి న‌టసింహం బాల‌కృష్ణ న‌టవార‌సుడు మోక్ష‌జ్ఞ సినీరంగ ప్ర‌వేశం గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ... సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు..? ద‌ర్శ‌కుడు ఎవ‌రు..? ఏ బ్యాన‌ర్ లో ఈ సినిమా ఉంటుంది అనేది అఫిషియ‌ల్ గా ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. అయితే...మోక్ష‌జ్ఞ తొలి చిత్రం గురించి ఓ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏమిటంటే...గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాన్ని వైజాగ్, సీడెడ్ ఏరియాల్లో నిర్మాత సాయి కొర్ర‌పాటి డిస్ట్రిబ్యూట్ చేసారు. శాత‌క‌ర్ణి అన్ని ఏరియాల్లో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది.

ఈ సంద‌ర్భంగా సాయి కొర్ర‌పాటి మీడియాతో మాట్లాడుతూ...మోక్ష‌జ్ఞ తొలి చిత్రాన్ని నిర్మించే అవ‌కాశాన్ని ఇస్తాన‌ని బాల‌కృష్ణ గారు నాకు మాట ఇచ్చారు. అందుచేత మోక్షజ్ఞ ఫ‌స్ట్ మూవీ మా వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ లోనే ఉంటుంది అని తెలియ‌చేసారు. ఇటీవ‌ల బాల‌య్య‌ను కూడా మోక్ష‌జ్ఞ సినిమా ఎప్పుడు ఉంటుంది అని అడిగితే ఇంకా టైమ్ ఉంది. త‌ర్వాత చెబుతాను అన్నారు. మ‌రి...త్వ‌ర‌లోనే మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి..!

More News

నాని 'నేను లోకల్' ఆడియో తేదీ

వరుస ఐదు చిత్రాల సక్సెస్ తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్ గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు సమర్పణలో ...

అమెరికాలో శాతకర్ణి కలెక్షన్స్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. జాగర్లమూడి క్రిష్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తుంది.

చరణ్ మూవీలో చైతు హీరోయిన్..!

ధృవ చిత్రంతో సక్సెస్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందే భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.

సంక్రాంతికి బేవర్స్ ఫస్ట్ లుక్

ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు సాంగ్స్ తో పాటు డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

నాగ్ మరోసారి బెంచ్ మార్క్ సెట్ చేసారంటున్న నాని..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి బెంచ్ మార్క్ సెట్ చేసారని నాని అంటున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే... అందరూ బాగుండాలి..! అందరి సినిమాలు విజయం సాధించాలి అని కోరుకునే మంచి మనిషి కింగ్ నాగార్జున.