హన్సిక పై తమిళ నిర్మాత చీటింగ్ కేసు...

  • IndiaGlitz, [Wednesday,July 20 2016]

సినిమాల్లో గ్లామ‌ర్‌తో పాటు సేవా కార్య‌క్ర‌మాల్లో కూడా ముందుండి అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్న హీరోయిన్ హ‌న్సిక పై ఓ త‌మిళ నిర్మాత చీటింగ్ కేసు న‌మోదు చేయ‌బోతున్నాడ‌ట‌. వివరాల్లోకెళ్తే..విజ‌య్ హీరోగా న‌టించిన 'పులి' చిత్ర నిర్మాతల్లో ఒక‌రైన పి.టి.సెల్వ‌కుమార్ ఆ చిత్రంలో హ‌న్సిక‌ను ఓ హీరోయిన్‌గా తీసుకున్నాడు.

త‌ర్వాత 'రంగం' ఫేమ్ జీవా హీరోగా చేసిన 'పోకిరి రాజా' చిత్రంలో కూడా హ‌న్సిక‌నే హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఈ సినిమా ఆడియో విడుద‌లైన ప్లాప్ కూడా అయ్యింది. అయితే ఈ సినిమా ఆడియో వేడుక‌కు హ‌న్సిక హాజ‌ర‌వుతాన‌ని చెప్ప‌డంతో నిర్మాత హ‌న్సిక కోసం ఫైవ్ స్టార్ హోట‌ల్‌, డిజైన‌ర్ గ‌ట్రా ఏర్పాట్ల‌కు బాగానే ఖ‌ర్చు పెట్టాడ‌ట‌. కానీ హ‌న్సిక చివ‌ర‌కు వేడుక‌కు హాజ‌ర కాలేక‌పోయింది. అయితే ఆ మొత్తాన్ని త‌న‌కు న‌ష్ట‌ప‌రిహారంగా చెల్లించాల‌ని కోర‌గా హ‌న్సిక బదులివ్వ‌క‌పోవ‌డంతో స‌ద‌రు నిర్మాత హ‌న్సిక‌పై లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకోవాల‌ని అనుకుంటున్నాడు.

More News

సుల్తాన్ ని మెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం సుల్తాన్.

సాయిధరమ్ కు ముహుర్తం ఫిక్స్ అయ్యింది...

వరుస విజయాల సాధిస్తూ ముందుకు సాగుతున్న మెగా క్యాంప్ హీరో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్

ఆ విషయంలో...బాహుబలి తర్వాతే కబాలి

యూరప్ లో అత్యధిక సిటింగ్ కెసాసిటీ గల థియటర్ పారీస్ లోని లీ గ్రాండ్ రెక్స్ థియేటర్.

ఆ రోజే...చుట్టాల‌బ్బాయి కూడా వ‌స్తున్నాడు

సాయికుమార్ త‌న‌యుడు ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రంలో ఆది స‌ర‌స‌న న‌మిత‌, యామిని హీరోయిన్స్ గా న‌టించారు. శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై రామ్, వెంక‌ట్ త‌లారి  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మహేష్ నెక్ట్స్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మురుగుదాస్ తో ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం తర్వాత మహేష్ నెక్ట్స్ మూవీ ఏమిటి అనేది ఇప్పటి వరకు సస్పెన్స్ గా ఉండేది.