హీరోగా ఎంట్రీ ఇస్తోన్న డీవీవీ దానయ్య కుమారుడు.. ఆకట్టుకుంటోన్న ‘ఫస్ట్ స్ట్రైక్’
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇలా ఎక్కడ చూసినా వారసుల ఎంట్రీలు మళ్లీ ఊపందుకున్నాయి. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల కొడుకులు, కూతుళ్లు, అల్లుల్లు , ఇతర బంధువర్గం వెండితెర మీద అడుగుపెడుతున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్, సూపర్‌స్టార్ మహేశ్ మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్‌లు వెండితెరకు పరిచయమయ్యారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో వారసుడు చేరాడు.
ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్ తెరంగేట్రం చేస్తున్నారు. విలక్షణ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అధీరా’ అనే సినిమాలో కల్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మేరకు ఆయన పరిచయ వీడియోను ‘అధీరా ఫస్ట్ స్ట్రైక్’ పేరిట ఎన్టీఆర్, రామ్‌చరణ్, దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు.
ఇందులో కల్యాణ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకి గౌరహరి స్వరాలు సమకూరుస్తున్నారు. ‘జంబలకిడి పంబ’తో టాలీవుడ్‌లో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన డీవీవీ దానయ్య.. ‘మావిడాకులు’, ‘సముద్రం’, ‘శివమణి’, ‘దేశముదురు’, ‘జులాయి’, ‘భరత్ అనే నేను’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోనన ‘ఆర్‌ఆర్‌ఆర్’ని ఆయనే నిర్మించారు. తద్వారా పాన్ ఇండియా స్థాయి చిత్ర నిర్మాతల జాబితాలో చేరారు దానయ్య. ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com