Dil Raju: తనపై తప్పుడు వార్తలు రాసిన సినీ జర్నలిస్టుకు దిల్ రాజు వార్నింగ్.. వీడియో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొద్దిరోజుల నుంచి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. తనపై తప్పుడు వార్తలు రాసిన వారి తాటతీస్తా అని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ సినీ పాత్రికేయుడిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పిచ్చిపిచ్చిగా రాస్తే వదిలిపెట్టను.. గుర్తుపెట్టుకోండి.. అంటూ మండిపడ్డారు. ఆయనను ఆపడానికి వచ్చిన మరో జర్నలిస్ట్ పైనా రాజు ఫైరయ్యారు. అలాగే వీడియో తీస్తున్న వ్యక్తిని ఏయ్ ఆపు అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిన్న ఓ మూవీ ఫంక్షన్లో దిల్ రాజు మాట్లాడుతూ ప్రతి సంక్రాంతికి తనపై తప్పుడు వార్తలు రాయడం, బురద జల్లడం అలవాటు అయిపోయిందని ధ్వజమెత్తారు. కొన్ని వార్తలని తెలియకుండా వక్రీకరించి రాస్తున్నారని ఇకపై అలా రాస్తే ఊరుకునేది లేదని 'తాట తీస్తాను' అని హెచ్చరించారు. హనుమాన్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) మాట్లాడుతూ "గతంలో సంక్రాంతి పండగకి నా 150వ సినిమా, బాలకృష్ణ గారి సినిమా విడుదలవుతుంటే, దిల్ రాజు తన సినిమా 'శతమానం భవతి' కూడా విడుదల చెయ్యడానికి సంసిద్ధం అయ్యారు. అప్పుడు నేను దిల్ రాజుతో రెండు పెద్ద సినిమాలు వున్నాయి కదా, నీ సినిమా డిలే చేస్తే బాగుంటుంది కదా అంటే, దానికి దిల్ రాజు 'శతమానం భవతి' కంటెంట్ బాగుంటుంది, రెండు పెద్ద సినిమాల మధ్య ఈ సినిమా కూడా ఆడుతుంది అని చెప్పారు' అని గుర్తుచేసుకున్నారు. అలాగే హనుమాన్ చిత్రం కూడా ఆడుతుందని వెల్లడించారు.
అయితే కొన్ని వెబ్‌సైట్స్ మాత్రం దిల్ రాజు మీద చిరంజీవి తీవ్ర విమర్శలు అంటూ ఆర్టికల్స్ రాశాయి. దీంతో కంట్రోల్ కోల్పోయిన దిల్ రాజు ఇకపై తనపై తప్పుడు వార్తలు రాస్తే తాటతీస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమిళ సినిమాను తాను విడుదల చేస్తున్నాను అంటూ రాశారు, కానీ తానే ఆ తమిళ సినిమా విడుదల వాయిదా వేయించానని.. ఇవేమీ తెలియాకుండా ఇష్టమొచ్చినట్టు లేనిపోని వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు.
మీరు తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు, తాను అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాను అని, మీరు నా గురించి వార్త రాసేటప్పుడు ఎటువంటి సందేహం వచ్చినా తనకు ఫోన్ చేస్తే మాట్లాడుతానన్నారు. తాను ఎప్పుడూ అందుబాటులో వుంటాను అని చెప్పారు. మరోసారి చెబుతున్నా మీ వైబ్ సైట్లకు తనను వాడుకుంటే 'తాటతీస్తా'అని వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడూ కూల్‌గా ఉండే దిల్ రాజు ఒక్కసారిగా బరస్ట్ కావడం ఇండస్ట్రీల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా సినీ జర్నలిస్టుకు ఏకంగా వార్నింగ్ ఇవ్వడం సంచనలంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments