అల్లు అర్జున్ గురించి దిల్ రాజు షాకింగ్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు అర్జున్, దిల్ రాజు కాంబినేషన్‌లో సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్ అయిపోయింది. సినిమాకు టైటిల్ మోషన్ పోస్టర్ సైతం విడుదలైంది. డైరెక్టర్‌గా కూడా వేణు శ్రీరామ్ కన్ఫర్మ్ అయిపోయారు. అంతా ఓకే... ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ చేస్తున్నాడు కాబట్టి అది అయిపోవడమే ఆలస్యం దిల్ రాజు సినిమాను పట్టాలెక్కించేస్తారన్న టాక్ బాగా నడుస్తోంది. అయితే ఈ సినిమాకు ‘ఐకాన్’ అనే ఇంట్రస్టెంట్ టైటిల్ కూడా ఇచ్చేశారు. అప్పటి నుంచి బన్నీని అభిమానులు ‘ఐకాన్’ స్టార్ అని పిలవడం మొదలు పెట్టారు. అంతా బాగానే ఉంది కానీ తాజా టాక్ మరోలా ఉంది.
‘వకీల్‌సాబ్’ పూర్తయినా కూడా వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ గురించి నోరు మెదపడం లేదు. ఇక బన్నీ కూడా ఎక్కడా ఈ సినిమా గురించిన ఊసే ఎత్తడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు మాత్రం ‘ఐకాన్’పై వస్తున్న వార్తలపై స్పందించారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తన తదుపరి చిత్రం ఐకాన్ ఉండబోతుందని వెల్లడించారు. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్లు దిల్ రాజు తెలిపారు. అయితే ఈ సినిమాలో బన్నీ పాత్రపై మాత్రం ఆయన ఎలాంటి కామెంట్ చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా బన్నీకి ఐకాన్ స్టార్ అనే టైటిల్‌ను తాము పెట్టలేదని, తనకు తాను పెట్టుకున్నాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో బన్నీకి, దిల్ రాజుకు మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరాయని టాక్ నడుస్తోంది.
అందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని.. ఈ నేపథ్యంలోనే బన్నీ కూడా ఈ సినిమాలోనటించడం లేదని గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. ముందు నుంచి విభేదాలు రావడంతోనే బన్నీ ఈ ప్రాజెక్టును పక్కనబెట్టి.. ‘పుష్ప’ తర్వాత కొరటాల డైరెక్షన్‌లో మూవీ చేసేందుకు రెడీ అయిపోయాడని టాక్ నడుస్తోంది. అయితే ‘వకీల్‌సాబ్’ హిట్‌తో వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో 'ఐకాన్' చేయడానికి అల్లు అర్జున్ అంగీకరించవచ్చని దిల్ రాజు తొలుత భావించరట. కానీ బన్నీ ఈ సినిమా ఊసే ఎత్తకుండా.. మరో మూవీ కమిట్ అవ్వడంపై దిల్ రాజ్ అసహనం వ్యక్తం చేస్తున్నారట. అందుకే ‘ఐకాన్’ కోసం మరో హీరోను వెదుకుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకూ నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments