Dil Raju:నిందలు వేయడం రాదు .. పదవులొద్దు, ఇండస్ట్రీ ఏకతాటిపైకి రావాలి : దిల్‌రాజు కీలక ప్రకటన

  • IndiaGlitz, [Saturday,July 29 2023]

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యక్తులు బరిలో వుండటంతో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నెల 30 ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కీలక ప్రకటన చేశారు. అసలు తాను ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందనే దానిపై ఆయన కీలక విషయాలను పంచుకున్నారు. తనకు పదవి ముఖ్యం కాదని, తెలుగు చిత్ర పరిశ్రమను ఏకతాటిపైకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. ఒకరిపై నిందలు వేయడం తనకు రాదని దిల్‌రాజు పేర్కొన్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ :

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల సమయంలో యలమంచిలి రవిచంద్ వచ్చి మీరు ఎన్నికల్లో పాల్గొనాలని కోరగా.. తాను వద్దు అన్నానని దిల్‌రాజు వెల్లడించారు. కౌన్సిల్ వెల్ఫేర్ కోసమైతే తాను ఫండ్స్ ఇస్తానని చెప్పానని, ఎన్నికల్లో పాల్గొనడం ఎందుకని అడిగానని చెప్పారు. ఆ తర్వాత ఇన్సురెన్స్ కార్డుల విషయంలో నిర్మాతల ఇబ్బందుల దృష్ట్యా పోటీ చేయాలని కోరితే అందుకు సిద్ధపడ్డానని, ఆ సమయంలో తనను గెలిపించారని దిల్‌రాజు పేర్కొన్నారు. ఆ తర్వాత ఇన్సురెన్స్ కార్డులు తీసుకొచ్చేందుకు అన్ని కంపెనీలతో మాట్లాడామని, ఏది తక్కువకు వస్తుందో తెలుసుకొని దానిని అమలు చేయడానికి కాస్త ఆలస్యమైందని ఆయన అంగీకరించారు. లేటైనా నాలుగు లక్షల ఇన్సురెన్స్ కార్డులు తీసుకువచ్చామని.. పెన్షన్ ఎక్కువ చేశామని, మిగిలిన హామీల అమలుకు ఫండ్ అవసరం ఉందని, అయినప్పటికీ ప్రతి హామీని నెరవేరుస్తామని దిల్‌రాజు స్పష్టం చేశారు.

30 రోజుల సమ్మెను వేలెత్తి చూపుతున్నారు :

తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల నేపథ్యంలో మీడియా సమావేశాలు పెట్టి ఒకరినొకరు నిందించుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు. తమకు పదవి ముఖ్యం కాదని.. కౌన్సిల్ ఎన్నికల్లో పోటీకి ఆహ్వానిస్తే ఎలా పని చేశామో... ఇప్పుడు అలానే చేస్తామని దిల్‌రాజు పేర్కొన్నారు. తమ ప్యానెల్‌లో పెద్ద సినిమాలు చేసే నిర్మాతలు 70 శాతం మంది, చిన్న సినిమాలు చేసే నిర్మాతలు 30 శాతం మంది ఉన్నట్లు ఆయన చెప్పారు. కానీ గతంలో 30 రోజులు సమ్మె సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనలను కొందరు వేలెత్తి చూపిస్తున్నారని దిల్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు జరిగిన కొన్ని పరిణామాల వలన, కొంత మంది ఒత్తిడి వలన సినిమాలని తాము కూడా ఆపలేని పరిస్థితికి తీసుకుని వచ్చారని దిల్‌రాజు పేర్కొన్నారు. అయినా సరే ఇప్పుడు వాటి గురించి వివరించి.. మళ్ళీ వేరొకరిని నిందించాలని తాము అనుకోవడం లేదన్నారు. UFO, QUBE సిస్టమ్‌ల సమస్య ఎప్పటి నుండో ఉన్న సమస్య అని.. ఒక్కరోజులో అది మార్చడమనేది తేలిక కాదన్నారు. అయినప్పటికీ ఆ సమస్యను పరిష్కరించడానికి అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నామని దిల్‌రాజు తెలిపారు.

కౌన్సిల్‌లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ విలీనం :

అనుభవజ్ఞులయిన ప్రొడ్యూసర్స్ అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో మా ప్యానెల్‌లో మోహన్ వడ్లపట్ల, బెక్కం వేణుగోపాల్, వై రాజీవ్ రెడ్డి, సతీష్ వేగేశ్న, నక్కా రాహుల్ యాదవ్, మోహన్ గౌడ్, పి.ఎల్.కె రెడ్డీ, జె.సాంబశివరావ్ , పద్మిణీ నాగులపల్లి వంటి పలువురు నిర్మాతలను తీసుకున్నామని దిల్‌రాజు పేర్కొన్నారు. తాము నెరవేర్చలేని హామీలు ఇవ్వమని.. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. నమ్మకంతో మా ప్యానెల్‌ను గెలిపిస్తే.. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు. చదలవాడ శ్రీనివాస రావు గిల్డ్‌ని కౌన్సిల్‌లో విలీనం చేయమని అడిగారని.. కౌన్సిల్ బై లా మారిన మరుక్షణం కౌన్సిల్‌లో దానిని విలీనం చేస్తామని దిల్‌రాజు హామీ ఇచ్చారు. ఇంతకు ముందు ఇచ్చిన హామీలలో మిగిలిన రెండు హామీలను కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇండస్ట్రీ మొత్తాన్ని ఏకతాటిపైకి తెస్తా :

ఫిల్మ్ ఛాంబర్‌కి సంబంధించిన అన్నీ సెక్టార్‌లను అభివృద్ధి చేసి చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఫిల్మ్ ఛాంబర్ అనే గొడుగు కిందకి తీసుకువచ్చి ఇండస్ట్రీని పటిష్ట పరుచుకోవాలన్నదే తమ ప్రయత్నమని దిల్‌రాజు తెలిపారు. ఛాంబర్‌లో ఇబ్బంది పడుతున్న వాళ్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని.. ఆర్ధికంగా నలిగిపోయిన నిర్మాతలకు చేదోడుగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళ సంక్షేమం కోసం, కాస్త ఆలస్యమైనా సరే సమస్యను పరిష్కరించేలా ప్రయత్నిస్తామని దిల్‌రాజు తెలిపారు. అసత్యాలు చెప్తూ, ఇతరులను నిందిస్తూ కాలం గడపడం అనేది మా విధానం కాదు.. అలాంటి రాజకీయాలు చేసే ఆలోచన, అవసరం కూడా మాకు లేదన్నారు.

More News

YS Jagan:ఏపీలో వరద బీభత్సం : బాధితులకు జగన్ భరోసా, కుటుంబానికి రూ.2 వేలు ఆర్ధిక సాయం.. మరో పదివేలు కూడా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో సర్వస్వం కోల్పోయిన వారికి ఆయన అండగా నిలిచారు.

Pawan Kalyan:గద్దర్‌ను పరామర్శించిన పవన్ .. రాజకీయం ఓ పద్మవ్యూహం , జాగ్రత్త : జనసేనానికి సూచనలు

అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు.

Mayabazaar For Sale:100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటి దూసుకుపోతున్న... 'మాయాబ‌జార్ ఫ‌ర్ సేల్‌' వెబ్‌సీరీస్

రానా ద‌గ్గుబాటి స్పిరిట్ మీడియా డెబ్యూ వెబ్ సిరీస్ ‘మాయాబజార్ ఫర్ సేల్’కు అమేజింగ్ రెస్పాన్స్‌... 100 మిలియన్ల‌ స్ట్రీమింగ్‌ మినిట్స్ దాటి దూసుకెళ్తోన్న ఒరిజిన‌ల్ సీరీస్‌

TSRTC:ప్రయాణీలకు అలర్ట్ : హైదరాబాద్ - విజయవాడ హైవేపై పోటెత్తుతోన్న వరద .. టీఎస్ఆర్టీసీ సర్వీసులు బంద్

భారీ వర్షాలు , వరదలతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి.

Nassar:కోలీవుడ్‌పై తప్పుడు ప్రచారం.. అలాంటి రూల్స్ లేవు, రోజా భర్తకు సపోర్ట్‌ : పవన్ వ్యాఖ్యలపై నాజర్ స్పందన

తమిళ సినిమాల్లో తమిళులకే అవకాశాలు ఇవ్వాలని.. తమిళ సినిమాలు తమిళనాడులోనే షూటింగ్‌లు జరుపుకోవాలంటూ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా