తత్త్వం బోధపడినట్లుందిగా.. ‘ఎఫ్ 3’కి టికెట్ రేట్లు పెంచనన్న దిల్‌రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్ 3 చిత్రం ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఎఫ్ 2 మూవీ సూపర్‌హిట్ కావడం, తాజాగా విడుదల చేసిన టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఎఫ్ 3పై మంచి అంచనాలు వున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. సాధారణ ధరలకే ఎఫ్ 3 మూవీని చూసి ఎంజాయ్ చేయాలంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఆయన విజ్ఞప్తి చేశారు.
సినిమా నిర్మాణ వ్యయం పెరగడం, థియేటర్లకు గిట్టుబాటు కాకపోవడం, కరోనా సంక్షోభం తదితర కారణాలతో ఇటీవలి కాలంలో విడుదలైన అన్ని పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచాయి. అయితే దీని వల్ల సామాన్యుడికి వినోదం భారంగా మారింది. నలుగురు సభ్యులున్న కుటుంబం థియేటర్‌కి సినిమా చూడాలంటే ఎలా లేదన్నా రెండు నుంచి మూడు వేల రూపాయలు వదిలించుకోవాల్సిందే. దీంతో మధ్య తరగతి, నిరుపేద కుటుంబాలు సినిమాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు.
సెమి అర్బన్, రూరల్ ఏరియాలలో రూ. 100-150 మధ్య టికెట్ దొరుకుతుండగా.. నగరాలు, పట్టణాలలో దీని ధర రూ.250 నుంచి రూ.500 మధ్య వుంటోంది. అంటే నెలలో రెండు , మూడు సార్లు సినిమాకి వెళితే సంసారం నడపడం కష్టమనే భావన ప్రేక్షకుల్లో కలుగుతోంది. దీని వల్ల సినిమాకు మహారాజ పోషకులైన ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌కు రావడం మానేశారు. ఓటీటీలోనో, టీవీల్లో వేసినప్పుడు చూడొచ్చులే అన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమాల విషయంలో ఈ విషయం కొట్టొచ్చినట్లు కనిపించింది. అనుభవమైతే కానీ తత్త్వం బోధపడదు అన్నట్లు ఈ చిత్రాల ఫలితంతోనే మెగా ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఆలోచనలో పడ్డారు. దీనిలో భాగంగానే ఎఫ్ 3 సినిమాకు టికెట్ రేట్లు పెంచాలనే ఆలోచనను విరమించుకున్నారు. ఆయన నిర్ణయంతో ప్రేక్షకులు ఖుషి అవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments