అందరూ చూడదగ్గ చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కళ్యాణ వైభోగమే - నిర్మాత దామోదర ప్రసాద్
Send us your feedback to audioarticles@vaarta.com
అలా...మొదలైంది, అంతకు ముందు ఆతర్వాత, హోరా హోరి...ఇలా వైవిధ్యమైన చిత్రాలను అందిస్తున్న అభిరుచి గల నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్. నాగ శౌర్య - మాళవిక నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో దామోదర ప్రసాద్ నిర్మించిన తాజా చిత్రం కళ్యాణ వైభోగమే. ఈ చిత్రాన్ని మార్చి 4న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ వైభోగమే గురించి నిర్మాత దామోదర ప్రసాద్ తో ఇంటర్ వ్యూ మీ కోసం...
కళ్యాణ వైభోగమే ఆడియోకు ఎలాంటి స్పందన లభిస్తుంది..?
మా ఆస్ధాన విద్వాంసుడు కళ్యాణి మాలిక్ కళ్యాణ వైభోగమే సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ప్రతి సినిమాకి ఆడియో బాగుంది అంటాం. నిజంగా మా బ్యానర్ లో వచ్చిన గత చిత్రాలన్నింటి కంటే బెటర్ ఆడియో ఇది. లక్ష్మీ భూపాల్ అన్ని పాటలకు చక్కని సాహిత్యాన్ని అందించారు. ముఖ్యంగా కళ్యాణం పై వచ్చే సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎక్కడ పెళ్లి జరిగినా ఈ సినిమాలోని కళ్యాణం పై వచ్చే సాంగ్ ను ఉపయోగిస్తుంటారనేది నా గట్టి నమ్మకం.
కళ్యాణ వైభోగమే కథాంశం ఏమిటి..?
ఇప్పుడున్న జనరేషన్ లో పెళ్లి అంటే...అప్పుడే పెళ్లా..అంటుంటారు. ఇంట్లో పెద్ద వాళ్లేమో పెళ్లి చేయాలనుకుంటారు. కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అప్పుడే పెళ్లి వద్దంటారు. అలా...ఇద్దరూ పెళ్లి వద్దనుకునే వాళ్లు అనుకోని విధంగా పెళ్లి చేసుకుంటే వారి జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించాం.
ఈ మూవీకి నాగ శౌర్యని ఎంచుకోవడానికి కారణం ఏమిటి..?
నాగ శౌర్య గత సినిమాలు చూసాను. అతను ఏ సీన్ చేసినా ఏదో చేయ్యాలని చేసినట్టు అనిపించదు. నేచురల్ గా చేసినట్టు అనిపిస్తుంటుంది. ఈ కథ నాగ శౌర్యకి కరెక్ట్ సరిపోతుంది అనిపించింది. నందినీ రెడ్డి కూడా నాగ శౌర్య అయితేనే బాగుంటుందని చెప్పడంతో నాగ శౌర్యనే ఈ సినిమాకి హీరోగా అనుకున్నాం. మేము అనుకున్నట్టే క్యారెక్టర్ కి తగ్గట్టు చాలా బాగా నటించాడు. ఖచ్చితంగా ఈ సినిమా నాగ శౌర్యకి మంచి పేరు తీసుకువస్తుంది.
మాళవిక నాయర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
మాళవిక నాయర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే...తను పెద్దల దగ్గర ఒకలా ఉంటుంది. పెద్దవారు లేకపోతే ఇంకోలా ఉంటుంది. నిజంగా కూడా మాళవిక అలానే ఉంటుందట. ఆ క్యారెక్టర్ తనకి దగ్గరగా ఉండడంతో పాత్రకు తగ్గట్టు చాలా నటించింది.
కళ్యాణ వైభోగమే సినిమాకి హైలెట్ ఏమిటి..?
ఈ సినిమాకి హైలెట్ అంటే ఇందులో ఉండే లవ్ స్టోరీ అని చెప్పవచ్చు. యూత్ ను ఆకట్టుకునేలా చాలా ఫ్రెష్ గా లవ్ స్టోరీ ఉంటుంది. అది ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.
ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఏం చెబుతున్నారు..?
అందరూ చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఈ సినిమాలో మంచి సందేశం ఉంటుంది. అది ఏమిటనేది ఇప్పుడు నేను చెప్పడం కన్నా తెరపై చూస్తేనే బాగుంటుంది. మెసేజ్ కూడా కావాలని చెప్పినట్టు కాకుండా ఎంటర్ టైన్మెంట్ గా చెప్పాం. అది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
అభిషేక్ పిక్చర్స్ కి వరల్డ్ వైడ్ రైట్స్ అమ్మడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా..?
ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని కొంత మంది డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మడం కన్నా...వరల్డ్ వైడ్ రైట్స్ ఒక్కరికే అమ్మడం వలన నిర్మాతకి లాభం అని చెప్పవచ్చు. మా సినిమా పై నమ్మకంతో అభిషేక్ పిక్చర్స్ వాళ్లు రైట్స్ అడగడంతో వాళ్లకే ఇచ్చాం. అంతే తప్పా ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. ముఖ్యంగా అలా...మొదలైంది సినిమాకి యు.ఎస్ లో మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో మేము నిర్మించిన ఈ సినిమాకి యు.ఎస్ లో మంచి క్రేజ్ ఏర్పడం సంతోషంగా ఉంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..?
ప్రస్తుతం ఈ సినిమా గురించే ఆలోచిస్తున్నాం. కధా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com