థియేటర్స్ మూసివేతపై నిర్మాతల మండలి చర్చ
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచం అంతా కరోనా వైరస్ ధాటికి భయపడుతుంది. ప్రజలు రద్దీ ప్రాంతాలకు రావడానికే భయపడుతున్నారు. మన దేశం విషయానికి వస్తే మన దేశం కూడా కరోనా వైరస్ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంది. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయింది. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. ఢిల్లీ, కేరళ ప్రాంతాలు ఈ నెల 31 వరకు థియేటర్స్‌ను మూసి వేస్తున్నట్లు ప్రకటించాయి. నెల్లూరులో కూడా థియేటర్స్‌ను మూసివేశారు.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కరోనా వైరస్ వల్ల తెలుగు సినిమాలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయనే దానిపై హైదరాబాద్ ఫిలించాంబర్‌లో నిర్మాతల మండలి చర్చ జరిగింది. ఈ చర్చలో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని, థియేటర్స్ మూసివేయమని తమను ఆదేశిస్తే తాము మూసి వేస్తామని కూడా వారు తెలిపారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో థియేటర్స్ బంద్‌పై వస్తున్న వార్తల్లో నిజం లేదని వారు తెలిపారు. ఈ సందర్భంలో ఉగాదికి విడుదల కాబోయే సినిమాలు వి, అరణ్య, నిశ్శబ్దం సినిమాల విడుదల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే నాని వి సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కాగా మిగిలిన సినిమాలు ఎలాంటి ప్రకటన చేస్తాయో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout