థియేట‌ర్స్ మూసివేత‌పై నిర్మాత‌ల మండ‌లి చ‌ర్చ‌

  • IndiaGlitz, [Saturday,March 14 2020]

ప్ర‌పంచం అంతా క‌రోనా వైర‌స్ ధాటికి భ‌య‌ప‌డుతుంది. ప్ర‌జ‌లు ర‌ద్దీ ప్రాంతాల‌కు రావ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు. మ‌న దేశం విష‌యానికి వస్తే మ‌న దేశం కూడా క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఇబ్బందుల‌ను ఎదుర్కొంటూ ఉంది. దేశ ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ప‌డిపోయింది. ప్ర‌జ‌లు ఇళ్ల నుండి బ‌య‌ట‌కు రావ‌డానికి ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఢిల్లీ, కేర‌ళ ప్రాంతాలు ఈ నెల 31 వ‌ర‌కు థియేట‌ర్స్‌ను మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. నెల్లూరులో కూడా థియేట‌ర్స్‌ను మూసివేశారు.

ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే క‌రోనా వైర‌స్ వ‌ల్ల తెలుగు సినిమాలు ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాయ‌నే దానిపై హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో నిర్మాత‌ల మండ‌లి చ‌ర్చ జ‌రిగింది. ఈ చ‌ర్చ‌లో నిర్మాత‌ల‌తో పాటు డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ త‌దిత‌రులు పాల్గొన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఉండటానికి తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకునే చ‌ర్య‌ల‌కు త‌మ వంతు స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని, థియేట‌ర్స్ మూసివేయ‌మ‌ని త‌మ‌ను ఆదేశిస్తే తాము మూసి వేస్తామ‌ని కూడా వారు తెలిపారు. అయితే ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో థియేట‌ర్స్ బంద్‌పై వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని వారు తెలిపారు. ఈ సంద‌ర్భంలో ఉగాదికి విడుద‌ల కాబోయే సినిమాలు వి, అర‌ణ్య‌, నిశ్శ‌బ్దం సినిమాల విడుద‌ల విష‌యంలో సందిగ్ధ‌త నెల‌కొంది. ఇప్ప‌టికే నాని వి సినిమాను వాయిదా వేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. కాగా మిగిలిన సినిమాలు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేస్తాయో వేచి చూడాలి.

More News

ఈ నెల 20న వస్తోన్న సోషియో ఫ్యాంటసీ చిత్రం ‘అంగుళీక’!!

ఆరువందల ఏళ్ల క్రితం జరిగిన ఓ యాథార్థ సంఘటన ఆధారం చేసుకుని సినిమాకు తగ్గట్టుగా కొన్ని కల్పిత పాత్రలతో తెరకెక్కిన సోషియో  ఫ్యాంటసీ చిత్రమే ‘అంగుళీక’.

అధికారిక ప్ర‌క‌ట‌న‌.. ‘వి’ వాయిదా

నేచుర‌ల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’. ఇందులో నాని నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

హిట్ పెయిర్ హ్యాట్రిక్

కొంద‌రు హీరో హీరోయిన్ జోడీ ప్రేక్ష‌కుల‌కు రిపీట్ అయినా బోర్ కొట్ట‌దు స‌రి క‌దా! వారు క‌లిసి న‌టిస్తే సినిమా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వ‌స్తుంది.

ఎక్స్‌క్లూజివ్: చిరు సినిమా నుంచి తప్పుకున్న త్రిష

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా విజయంతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది.

జగన్ కేబినెట్‌లో రోజా, ఆళ్లకు నో ఛాన్స్.. ఆ ఇద్దరు వీళ్లే..!

ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దల సభకు వెళ్లే అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేసిన సంగతి తెలిసిందే.