టైటిల్ కన్ ఫర్మ్ చేసిన నిర్మాత...
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్, సంతోష్ శ్రీన్‌వాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కందిరీగ తర్వాత వీరి కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. 14రీల్స్ బ్యానర్‌పై కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూల్ జరుపుకుంటోంది.
సినిమా పూర్తయ్యే వరకు ఈ షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా జరుగుతుంది. సినిమాను సెప్టెంబర్30న దసరా సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ హైపర్ అని పరిశీలిస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే `హైప`ర్ అనే టైటిల్‌నే కన్‌ఫర్మ్ చేస్తున్నట్లు నిర్మాతల్లో ఒకరైన రామ్ ఆచంట తెలియజేశారు. `ప్రతి ఇంట్లో ఒకడుంటాడు` అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఆగస్ట్ 3న విడుదలవుతుందని తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments