రవితేజ రెమ్యూనరేషన్ పై నిర్మాత మెలిక
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ 66వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఠాగూర్ మధు నిర్మాతగా గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాడట. రెండేళ్ల తర్వాత శృతిహాసన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాకు రవితేజ రెమ్యునరేషన్లో కొంత మేరనే తీసుకుంటున్నాడట. మిగిలిన మొత్తాన్ని బిజినెస్ జరిగే దాన్ని బట్టే తీసుకుంటాడట. ప్రస్తుతం రవితేజ సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను రాబట్టుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రవితేజకు ఇలాంటి ప్రతిపాదనను నిర్మాత పెట్టాడట. ఈ ప్రపోజల్ రీజనబుల్‌గా ఉండటంతో మాస్ మహారాజా కూడా ఓకే చెప్పాడట.
రవితేజ ప్రస్తుతం డిస్కోరాజాను పూర్తి చేసే పనిలో ఉన్నాడట. ఈ సినిమా తర్వాత.. అంటే నవంబర్‌లో రవితేజ కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళతాడట. రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా నటించడం ఇది మూడో సారి. ఇది వరకు విక్రమార్కుడు, టచ్ చేసి చూడు చిత్రాల్లో నటించాడు. ఈ రెండింటిలో విక్రమార్కుడు బ్లాక్‌బస్టర్ కాగా.. టచ్ చేసి చూడా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా అలరించడానికి సిద్ధమైయ్యాడు. ఆసక్తికరమైన విషయమేమంటే.. బలుపు తర్వాత అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది. మరోసారి ఈ కాంబినేషన్ హిట్‌ను అందుకుంటుందో లేదో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout