కమల్‌హాసన్‌పై ఫిర్యాదు చేసిన నిర్మాత
- IndiaGlitz, [Thursday,September 26 2019]
విలక్షణ నటుడు, నిర్మాత కమల్‌హాసన్‌పై ప్రముఖ నిర్మాత, స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా ఫిర్యాదు చేశారు. ఇంతకు ఈయన ఫిర్యాదు చేయడానికి గల కారణమేంటో తెలుసా? ఈయనకు కమల్‌హాసన్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండిపోయిన డబ్బులేనట. వివరాల్లోకెళ్తే.. ఉత్తమవిలన్ సినిమాలో కమల్‌హాసన్ హీరోగా నటిస్తూ.. సినిమాను నిర్మించారు. ఆ సినిమా మేకింగ్ సమయంలో జ్ఞానవేల్‌రాజా దగ్గర రూ.10 కోట్లు తీసుకున్నాడట. 2015లో ఈ మొత్తం తీసుకునే సమయంలో స్టూడియో గ్రీన్ బ్యానర్లో ఓ సినిమా చేస్తానని కమల్ చెప్పాడట.
నాలుగేళ్లు అవుతున్నా.. కమల్ డబ్బులు ఇవ్వడం లేదు.. అలాగే సినిమా కూడా చేయడం లేదు. దీంతో జ్ఞానవేల్ రాజా నిర్మాతల మండలిని ఆశ్రయించాడట. డబ్బులు తిరిగివ్వాలని లేని పక్షంలో సినిమా చేయాలని కోరాడట. మరి దీనిపై నిర్మాతల మండలిని ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ భారీ చిత్రం 'ఇండియన్ 2'లో నటిస్తున్నాడు. 23 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రూపొందుతోంది. కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీని తర్వాత కమల్‌హాసన్ మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్ఞానవేల్ రాజా కమల్‌పై ఫిర్యాదు చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.