'హ్యాపీడేస్' ని మించి పోయేలా ఉంటుంది 'ఆనందం' : నిర్మాత
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం నడుస్తోన్న ట్రెండ్ ప్రకారం ఏ సినిమా అయినా యువతకు రీచ్ అయిందంటే సూపర్‌డూపర్ హిట్ కిందే లెక్క. దానికి ఫ్యామిలీ ఆడియన్స్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టినట్టే. మలయాళంలో విడుదలైన 'ఆనందం' కూడా అలా అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమానే.
కలెక్షన్ల కనక వర్షం కురిపించిన చిత్రమే. రూ. 4 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.20 కోట్లు వసూలు చేసిందంటేనే ఆ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో ఊహించుకోవచ్చు. అంతలా ప్రేక్షకాదరణ పొందిన ఆ సినిమాను సుఖీభవ మూవీస్ పతాకంపై నిర్మాత ఎత్తరి గురురాజ్ `ఆనందం` అనే టైటిల్‌తోనే తెలుగులోకి అనువదిస్తున్నారు.
గణేశ్ రాజ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. కేరళ టాప్ హీరో 'ప్రేమమ్' ఫేమ్ నివిన్ పాల్ ఇందులో గెస్ట్ రోల్ చేశారు. మిగిలిన వాళ్లందరూ కొత్తవారే కావడం గమనార్హం. వీరా వెంకటేశ్వర రావు (పెదబాబు ), వీఆర్బీ రాజు , రవి వర్మ చిలువూరి ఈ చిత్రానికి సహ నిర్మాతలు . సీనియర్ నిర్మాత ఆర్. సీతారామరాజు ఈ చిత్రానికి సమర్పకులు.
ఈ సినిమా గురించి చిత్ర నిర్మాత ఎత్తరి గురురాజ్ మాట్లాడుతూ "ఒక ఇండస్ట్రియల్ టూర్.. నాలుగు రోజులు.. మూడు ప్రేమకథలు..క్లుప్తంగా 'ఆనందం' సినిమాలోని విషయం ఇదే.అంటే 1 4 3 అన్న మాట . ఆద్యంతం యూత్‌ఫుల్‌గా ఉంటుంది. మన దగ్గర ఆ మధ్య విడుదలైన 'హ్యాపీడేస్' ని మించిపోయేలా ఉంటుంది సినిమా.
పొరుగు రాష్ట్రాల్లో ఏ సినిమా హిట్ అయినా మనవారికి ఇట్టే తెలిసిపోతున్న రోజులివి. 'ఆనందం' సినిమా హక్కుల్ని మేం దక్కించుకున్నామని తెలిసిన వారందరూ ఫోన్లు చేసి 'బంపర్ హిట్ కొట్టబోతున్నారు.. ముందస్తుగా కంగ్రాట్స్' అని చెబుతున్నారు. వారి మాటలు వింటుంటే ఆనందంగా ఉంది. ఎంతో గొప్ప పోటీని తట్టుకుని మేం ఈ సినిమా హక్కుల్ని దక్కించుకున్నాం.
మలయాళంలో ఆ రేంజ్ హిట్ అయిన చిత్రమిది. అక్కడ వాళ్లు పెట్టిన ఖర్చుకు ఐదింతలు వసూళ్లు రాబట్టిందంటేనే ఆ సినిమా స్టామినాను అర్థం చేసుకోవచ్చు. అది అర్థం చేసుకుని కొందరు రీమేక్ చేయడానికి రైట్స్ ఇవ్వండని మమ్మల్ని అడిగారు. అయితే తెలుగు నేటివిటీకి సరిపోయే అంశాలు ఇందులో పుష్కలంగా ఉండటంతో మేం అనువాదం చేయాలనే నిర్ణయించుకున్నాం.
ఇందులో 'ప్రేమమ్' ఫేమ్ కేరళ టాప్ హీరో నివిన్ పాల్ తప్ప, మిగిలిన వాళ్లందరూ కొత్తవారే నటించారు. ఎక్కడా ఓవర్ డ్రామా, మెలో డ్రామా, సినిమాటిక్ డ్రామా కనిపించదు. మలయాళంలో టాప్ మ్యూజిక్ డైరక్టర్ సచిన్ వారియర్ వినసొంపైన సంగీతాన్ని సమకూర్చారు. అనువాద కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. మార్చిలో సినిమాను విడుదల చేస్తాం" అని చెప్పారు.
అరుణ్ కురియన్, థామస్ మాథ్యూ, రోషన్ మాథ్యూ, విశాక్ నాయర్, సిద్ధి మహాజనకట్టి, అన్ను ఆంటోని, అనార్కళి మరికర్, నివిన్ పాల్, రెంజి ఫణిక్కర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎం.రాజశేఖర రెడ్డి, పాటలు: వనమాలి, సంగీతం: సచిన్ వారియర్, కెమెరా: ఆనంద్. ఇ. చంద్రన్, సహ నిర్మాతలు :వీరా వెంకటేశ్వర రావు (పెదబాబు ), విఆర్‌బి రాజు ,రవి వర్మ చిలువూరి , దర్శకత్వం: గణేశ్ రాజ్, సమర్పణ: ఆర్. సీతారామరాజు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments