ఇళ‌య‌రాజాపై నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్యలు

మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా ప్ర‌సాద్ ల్యాబ్స్ నుండి త‌న‌ను బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపుతున్నార‌ని, త‌న వాయిద్య ప‌రిక‌రాల‌ను నాశ‌నం చేశారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై నిర్మాత, సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కాట్ర‌గ‌డ్డ ప్ర‌సాద్ స్పందిస్తూ... ‘‘పాతిక ఎక‌రాల భూమిని 1950లో ఎల్‌.వి.ప్ర‌సాద్‌గారు కొని ప్ర‌సాద్ ల్యాబ్స్‌ను అభివృద్ధి చేశారు. కోడంబాకం ఏరియాలో ఒక‌ప్పుడు సాయంత్రం ఆరు దాటితే జ‌నాలు వెళ్ల‌డానికి భ‌య‌ప‌డేవారు. అలాంటి ఏరియాలో ఎల్‌.వి.ప్ర‌సాద్‌గారు, ఎ.వి.మెయ్య‌ప్ప‌న్‌గారు, నాగిరెడ్డి చ‌క్ర‌పాణిగారు స్టూడియోలు క‌ట్టారు. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు కోర్చి స్టూడియోల‌ను నిర్మించారు. ఈ మూడు స్టూడియోలు సినీ ఇండ‌స్ట్రీకి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఇవి దేదీప్య‌మానంగా వెలుగుతున్న స‌మ‌యంలో నాలుగు రాష్ట్రాల‌కు చెందిన సినిమా షూటింగ్స్ చెన్నైలోని ఈ మూడు స్టూడియోల్లోనే జ‌రిగేవి.

ఇప్పుడు అలాంటి చ‌రిత్ర ఉన్న ప్ర‌సాద్ స్టూడియోలో ఇళ‌య‌రాజాగారు థియేట‌ర్ నాదంటూ, స్థ‌లం నాదంటూ కాంట్ర‌వ‌ర్సీ చేయ‌డం, కోర్టు కెళ్ల‌డం బాధాక‌రం. ఇలా చేయ‌డం ఇవాళ ఆయ‌న ఉన్న స్థాయికి త‌గ‌ద‌ని నేను భావిస్తున్నాను. ఆరోజుల్లో ఇళ‌యరాజాగారు, దేవాగారు, చ‌క్ర‌వ‌ర్తిగారు బిజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌గా ఉన్నారు. ఆరోజుల్లో వాళ్ల‌కి రికార్డింగ్ థియేట‌ర్స్ కావాలంటే ఇబ్బందులు వ‌స్తాయేమోన‌ని ఎల్‌.వి.ప్ర‌సాద్‌గారు ఇళ‌య‌రాజాగారి కోసం ప్ర‌సాద్ డీల‌క్స్ థియేట‌ర్‌ను డెవ‌లప్ చేసి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ సిద్ధం చేసి ఆయ‌న రికార్డింగుల‌కు అనుకూలంగా చేసి ఇచ్చారు. అప్ప‌ట్లో చ‌క్ర‌వ‌ర్తిగారికి ఎవీయం స్టూడియోలో ప్ర‌త్యేక‌మైన రీరికార్డింగ్ రూమ్ ఉండేది. ఇలా వీరు బిజీగా సినిమాలు చేశారు.

ఇళ‌య‌రాజాగారు ఇప్పుడు ప్ర‌సాద్ ల్యాబ్స్ స్థ‌లం నాదంటూ కోర్టు కెక్క‌డం త‌గదు. ఇటు ఇళ‌య‌రాజాగారికి కానీ.. అప్ప‌ట్లో ఇళ‌య‌రాజా చేసే రికార్డింగుల‌కు ఆయ‌న ప‌నిచేసే నిర్మాత‌లే ప్ర‌సాద్ ల్యాబ్స్‌కు డ‌బ్బులు క‌ట్టేవారు. అటు ప్ర‌సాద్ ల్యాబ్స్ యాజ‌మాన్యానికి కానీ.. ఎలాంటి డీలింగ్స్ లేవు. ఆయ‌న త‌న థియేట‌ర్‌ను కూల‌గొట్టార‌ని పేపేర్ల‌కు ఎక్కారు. ఈ స‌మ‌స్య ప్రారంభం రోజునే ఇన్‌వాయిస్ చూపించి త‌న వాయిద్య ప‌రిక‌రాల‌ను ఇళ‌య‌రాజా తీసుకెళ్లిపోయారు. ఎల్‌.వి.ప్రసాద్‌గారి ఫ్యామిలీ త‌ర‌త‌రాలుగా సినీ ఇండ‌స్ట్రీకి ఎంతో సేవ చేశారు. ఇప్పుడున్న ప్ర‌సాద్ థియేట‌ర్స్ స్థానంలో కొత్త థియేట‌ర్‌ను క‌ట్టాల‌నే వారు ఆలోచిస్తున్నారు. ఇళ‌య‌రాజాగారు పెద్ద లెజెండ్ అలాంటి వ్య‌క్తి ఇలాంటి ప‌నులు చేయ‌డం త‌గ‌దు. ఆయ‌న ఎందుకు ఈ ప‌ని చేశారు? ఎవ‌రి మాట విని చేశారు? అని తెలియ‌డం లేదు. ఇలాంటి ప‌నుల‌ను ఇండ‌స్ట్రీ ఎప్పుడూ హ‌ర్షించ‌దు. ఇప్ప‌టికైనా ఆయ‌న కోర్టు కేసుల‌ను వాపస్ తీసుకుంటే బావుంటుంది’’ అన్నారు.

More News

దేశంలో 18 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఇవాళ కూడా...

దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 18 లక్షలు దాటేశాయి. వరుసగా ఐదు రోజులుగా దేశంలో కరోనా కేసులు 50 వేలు దాటుతున్న విషయం తెలిసిందే.

సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్..

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రముఖ రాజకీయ నేతలు కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

మూడు రాజధానుల అంశంపై జనసేన కీలక నిర్ణయం..

మూడు రాజధానుల అంశంపై జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు అండగా నిలవాలని నిర్ణయించారు. నేడు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.

బ్రేకింగ్: అమిత్ షాకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కరోనా బారిన పడగా..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. తెలంగాణ నేతలతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోడంతో..