'ఆర్ఆర్ఆర్' విడుదలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Send us your feedback to audioarticles@vaarta.com
రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘రౌద్రం రణం రుధిరం’. ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ఈ ఏడాది జూలై 30న విడుదల కావాల్సింది. అయితే ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు గాయాలు కావడంతో గ్యాప్ వచ్చింది. దాంతో మేకింగ్‌లో కాంప్రమైజ్ కానీ జక్కన్న సినిమా విడుదలను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న చేయాలనుకున్నాడు. అయితే కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్ ఆగింది. దీంతో సినిమా విడుదల మరోసారి వాయిదా పడుతుందంటూ వార్తలు వినపడ్డాయి. అయితే రీసెంట్గా విడుదలైన మోషన్ పోస్టర్లో అలాంటిదేం లేదని జక్కన్న పోస్టర్లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. కానీ సినిమా విడుదల పోస్ట్ పోన్ అవుతుందంటూ వార్తలు వినపడుతూనే ఉన్నాయి.
అయితే ఈ వార్తలను నిర్మాత డి.వి.వి.దానయ్య ఖండించారు. సినిమాను అనుకున్నట్లుగానే జనవరి 8న విడుదల చేస్తామని దానయ్య కన్ఫర్మ్ చేశారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు కారణాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకటి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ సహా అజయ్ దేవగణ్, ఆలియా భట్వంటి బాలీవుడ్ తారలు.. ఒలివియా మోరిస్, రేస్టీవెన్ సన్, అలిసన్ డూడీ వంటి హాలీవుడ్ తారలు ఈ చిత్రంలో నటిస్తుండం మరో కారణం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout