నిర్మాతను మార్చేసిన చరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ్ చిత్రం తని ఓరువన్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కూడా బ్రూస్ లీ నిర్మాత దానయ్యే నిర్మించాలనుకున్నారు. చరణ్ కూడా ఓకె అన్నాడు. అయితే బ్రూస్ లీ సినిమా ఇచ్చిన రిజల్ట్ తో ఆలోచనలో పడ్డ చరణ్ నిర్మాతను మార్చేసాడట.
తన తదుపరి చిత్రాన్ని నిర్మించమని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ను అడిగినట్టు సమాచారం. అలాగే ఎటువంటి సినిమాలు చేయాలనే విషయంలో కూడా సలహాలు, సూచనలు కావాలని అల్లు అరవింద్ ను అడిగాడట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ మూవీకి ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు స్ర్కిప్ట్ లో మార్పులు చేస్తున్నారట. మరి..మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించే సినిమాతో నైనా చరణ్ కి సక్సెస్ వస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments