గుంటూరు టాకీస్ ని కొనేసిన నిర్మాత‌

  • IndiaGlitz, [Saturday,February 06 2016]

చంద‌మామ క‌థ‌లు సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్న డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కించిన తాజా చిత్రం గుంటూరు టాకీస్. ఈ చిత్రంలో సిద్దు, శ్ర‌ద్దా దాస్, ర‌ష్మి, గౌత‌మ్, సీనియ‌ర్ న‌రేష్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఇటీవ‌లే గుంటూరు టాకీస్ టీజ‌ర్ ను నంద‌మూరి బాల‌కృష్ణ లాంఛ్ చేసారు. టీజ‌ర్ కు మంచి స్పంద‌న ల‌భిస్తుంది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... చిన్న సినిమాల‌కు పెద్ద దిక్కుగా మారిన ప్ర‌ముఖ నిర్మాత సాయి కొర్ర‌పాటి గుంటూరు టాకీస్ వ‌ర‌ల్డ్ వైడ్ పంపిణీ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నారు. గ‌తంలో రాజు గారి గ‌ది, జ‌త‌క‌లిసే చిత్రాల‌ను సాయి కొర్ర‌పాటి రిలీజ్ చేసారు. ఇప్పుడు గుంటూరు టాకీస్ సినిమా రైట్స్ సాయి కొర్ర‌పాటి ద‌క్కించుకోవ‌డంతో ఫుల్ హ్యాఫీగా ఉన్నాడు డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు.