Bunny Vasu:రాజకీయాల్లోకి నిర్మాత బన్నీ వాసు.. జనసేన ప్రచారం విభాగం ఛైర్మన్‌గా నియామకం..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో కాలు మోపాలని జనసేన గట్టి పట్టుదలతో ఉంది. అధికార వైసీపీని గద్దె దించేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత బన్నీ వాసును జనసేన ప్రచార విభాగం ఛైర్మన్‌గా నియమించారు. స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీలో అయినా ప్రచార విభాగం చాలా ముఖ్యమని.. పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేది ప్రచారమేనని తెలిపారు. జనసేన పార్టీ ఆశయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలోపేతం చేయాలని సూచించారు. రాబోయేది ఎన్నికల ఏడాది కాబట్టి టీడీపీ-జనసేన నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని బన్నీ వాసును పవన్ ఆదేశించారు. దీంతో సినిమాలు తీస్తూ నిర్మాతగా బిజీగా ఉండే బన్నీ వాసు ఇకపై రాజకీయాల్లో కూడా బిజీ కానున్నారు.
కాగా జనసేనలోకి చేరికలు జోరందుకున్నాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి నేతలు జనసేనలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ కార్పొరేటర్ మహ్మద్ సాధిక్‌తో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన గరికపాటి వెంకట్‌లకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారి జనసేనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. వైసీపీ విముక్త ఆంధ్రపదేశ్ చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్నానని మరోసారి స్పష్టంచేశారు. రాష్ట్రం బాగుపడాలంటే పదేళ్లు టీడీపీతో పొత్తు అవసరమని పవన్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout