Bandla Ganesh:ఎన్నికల టైం మరీ ఏం చేస్తాం.. బండ్ల గణేష్‌కు రాజకీయాలపై మనసు మళ్లిందేమో, ఆ ట్వీట్లకు అర్ధమేంటీ..?
- IndiaGlitz, [Saturday,May 13 2023]
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తారు సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై ఆయన ఈగ వాలనివ్వరు. అలాగే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు వీర విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా మెలిగే అతికొద్దిమంది సినీ ప్రముఖులలో గణేశ్ కూడా ఒకరు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుండే బండ్ల గణేష్ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు రాజకీయాలు తదితర అంశాలపై స్పందిస్తూ ట్వీట్లు చేస్తూ వుంటారు.
కాంగ్రెస్ పార్టీలో చేరి రాజీనామా చేసిన బండ్ల గణేష్:
ఇకపోతే.. సినిమాలతో పాటు రాజకీయాలపైనా బండ్ల గణేష్‌కు మక్కువ ఎక్కువ. సమకాలీన రాజకీయాలపై ఆయన తరచుగా స్పందిస్తూ వుంటారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ రాజీనామా చేశారు. సినిమాలతోనైనా బిజీగా వుంటారనుకుంటే .. పూర్తిగా నిర్మాణ రంగాన్ని పక్కన పెట్టేశారు బండ్ల గణేష్. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్‌లకు ఆయన హాజరవుతున్నారు . మొన్నామధ్య డేగల బాబ్జీ అనే సినిమాలో నటించి హీరోగానూ నటించి తన కోరికను తీర్చుకున్నారు.
అందుకే వస్తానంటూ ట్వీట్:
అయితే ప్రస్తుతం బండ్ల గణేష్ మనసు రాజకీయాల వైపు మళ్లినట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, అంతకుముందే ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వుండటంతో ఆయన రాజకీయాల గురించి ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అన్ని సెట్ అయితే మళ్లీ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరుతారేమోనని ప్రచారం జరుగుతోంది. బండ్ల గణేష్ తాజాగా చేసిన వరుస ట్వీట్లు ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. ‘‘రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయమంటూ బాంబు పేల్చిన ఆయన ఆ కాసేపటికే.. నీతిగా, నిజాయితీగా, నిబద్ధగా, ధైర్యంగా , పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తానంటూ మరో ట్వీట్ చేశారు. ఆ కాసేపటికే బానిసత్వానికి బైబై, నిజాయితీతో కూడిన రాజకీయాలకు జైజై.. రాజకీయాలంటే నిజాయితీ, రాజకీయాలంటే నీతి, రాజకీయాలంటే కష్టం..రాజకీయాలంటే పౌరుషం, రాజకీయాలంటే శ్రమ, రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ రాజకీయాల్లోకి చేరాలి.. రావాలి.. అందుకే వస్తానంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో బండ్ల గణేష్ వ్యవహారం ఫిలింనగర్‌లో మరోసారి చర్చనీయాంశమైంది.
నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం 🔥🔥🔥🔥
— BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023
నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా 🔥
— BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023
రాజకీయాలంటే నిజాయితీ రాజకీయాలంటే నీతి రాజకీయాలంటే కష్టం రాజకీయాలంటే పౌరుషం రాజకీయాలంటే శ్రమ రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా🔥🔥🔥🔥🔥
— BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023