విజయ్ సినిమాను భారీ మొత్తంలో సొంతం చేసుకున్న తెలుగు నిర్మాత
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు సూర్య, విక్రమ్ లాంటి కోలీవుడ్ హీరోలకు తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. గజినీతో సూర్య, అపరిచితుడుతో విక్రమ్... తమ మార్కెట్‌ను అమాంతం పెంచేసుకున్నారు. ఇక రజినీ, కమల్ విషయం చెప్పాల్సిన పని లేదు. వాళ్లకు మొదటి నుంచి తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో అభిమానులు ఉండటంతో.. వారి మార్కెట్‌కు ఎప్పటిలానే ఉంది. తాజాగా ఈ జాబితాలో హీరో విజయ్ చేరాడు. ‘అదిరింది’, ‘సర్కార్’ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇటీవల విడుదలైన బిగిల్.. తెలుగులో విజిల్‌గా రిలీజైంది. మహేశ్ కోనేరు రూ.9.5 కోట్లకు ఈ సినిమా హక్కులను పొంది.. తెలుగులో రిలీజ్ చేశాడు. విజయ్ కెరీర్‌లో తెలుగులో అమ్ముడైన సినిమా ఇది. విజయ్ తర్వాత స్థానాల్లో కార్తి, విజయ్ సేతుపతి ఉన్నారు. కార్తి సినిమాలు తమిళ్, తెలుగు భాషల్లో రూపొందడం.. ఇక్కడా విజయం సాధించడం.. తెలిసిన విషయమే. తాజాగా విడుదలైన ఖైదీ, దొంగ సినిమాలు.. ఆయనకు స్థిరమైన మార్కెట్‌ను ఏర్పరిచాయి. ఇదీ కోలీవుడ్ స్టార్ హీరోల తెలుగు మార్కెట్ పరిస్థితి.
ఇక అసలు విషయానికొస్తే.. విజయ్ తన తదుపరి చిత్రాన్ని ఖైదీ ఫేమ్ లోకేశ్ కనగరాజ్‌తో చేస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ సేతుపతి .. మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తెలుగులో ఈ సినిమా హక్కులను మహేశ్ కోనేరు రూ.8.5 కోట్లకు సొంతం చేసుకున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout