మే 5న 'రక్షకభటుడు' - నిర్మాత ఎ.గురురాజ్
Send us your feedback to audioarticles@vaarta.com
వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `రక్షకభటుడు`. ఈ సినిమాను మే 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా సుఖీభవ మూవీస్ పతాకంపై రూపొందుతోంది. ఏప్రిల్ 11న చిత్ర నిర్మాత ఎ.గురురాజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు.
అదే కారణం...
మా సినిమాలో కీలక పాత్ర పోషించారు ఆంజనేయస్వామి. ఆయన నాకు ఇష్టదైవం. నేను ఆంజనేయస్వామి ఉపాసకుడిని. ఆంజనేయస్వామి మంగళవారం రోజే సీతమ్మవారిని లంకనుంచి తీసుకొచ్చారట. ఆంజనేయ స్వామి పుట్టినరోజును హనుమత్‌జయంతిగా మనమంతా జరుపుకుంటాం. అదే రోజు నా పుట్టినరోజు (ఏప్రిల్ 11న) కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక రక్షకభటుడు సినిమా విషయానికి వస్తే, సినిమాను ముందుగా ఏప్రిల్ 7న విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ మేం విడుదల చేయకపోవడానికి ఓ కారణం ఉంది. ఆన్‌లైన్ సెన్సార్ వల్ల మా సినిమాకు ఇంకా సెన్సార్ కాలేదు. క్లైమాక్స్ లో ఆంజనేయ స్వామి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఆ పాత్రకు సంబంధించిన గ్రాఫిక్స్ పనుల్లోనూ ఆలస్యం జరిగింది. అందుకే విడుదల తేదీలో వాయిదా పడింది
మా సంస్థ బ్రాండ్‌కి తగ్గ సినిమా..
సుఖీభవ ప్రాపర్టీస్‌తో రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చిన నన్ను ప్రజలు ఆదరించారు. కళామతల్లిపై ఉన్న అభిమానంతో నిర్మాతగా మారాను. మా సుభీభవ మూవీస్ సంస్థ నుండి వస్తున్న రక్షకభుటుడు మా బ్యానర్ బ్రాండ్‌కి తగినట్టుగా ఉంటుంది.
ఫ్యామిలీ అంతా చూసే చిత్రం..
రక్షకభటుడు సినిమాను కుటుంబంలో అందరూ కలిసి చూడొచ్చు. ఇప్పట్లో ఏ సినిమాకు ఫ్యామిలీతో వెళ్లే పరిస్థితులు లేవు. కొత్త కొత్త క్రియేటివ్ డైరక్టర్లు, క్రియేట్ చేసే కథల్లో హాస్యం ఎన్ని పాళ్లు ఉంటుందో, శృంగారం ఎన్ని పాళ్లు ఉంటాయో తెలియవు. టీవీలో కూడా కొన్ని యాడ్స్ వచ్చినప్పుడు చానెల్స్ని మార్చే పరిస్థితి ఉంది. ఎక్కువ శృంగారాన్నిపెట్టి కమర్షియల్‌గా హిట్ చేయాలనుకోవడం తప్పు. గతంలో వచ్చిన సినిమాల్లో శృంగారం కూడా ఉంటూ, కామెడీ వంటివన్నీమిళితం చేసేవారు. ఆ సినిమాలు 500 రోజులు కూడా ఆడినవి ఉన్నాయి. సుఖీభవ సంస్థ మీద వచ్చే సినిమాలన్నీ ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉంటాయి.తొలి ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు కామెడీ ఉంటుంది. 20 నిమిషాలు క్లైమాక్స్ మాత్రం హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. 20 నుంచి 60ఏళ్ల వరకు అందరినీ ఆకట్టుకునే సినిమా ఇది.
అదెవరనేది సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.
సుఖీభవ సంస్థ బ్రాండ్‌కి తగ్గకుండా ఉండేలా ఈ సినిమా ఉంటుందన్న నమ్మకంతో రక్షకభటుడు సినిమాను ఎన్నుకున్నాం. ఆంజనేయ స్వామి పాత్రను మేం ఇంకా రివీల్ చేయలేదు. దాంతో పాటు ఇంకో ఇంపార్టెంట్ పాత్రను కూడా రివీల్ చేయలేదు. అందులోనూ పెద్ద ఆర్టిస్ట్ ఉంటాడు. ఆంజనేయుడి పాత్రను ఎవరు చేశారని చాలా మంది అడిగారు... కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఆసక్తి ఎలా ఉందో, అలాగే మా ఆంజనేయుడి గురించి కూడా అలాగే ఉత్కంఠత కొనసాగుతోంది..
అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా..
చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు. అరకులోయలో పోలీస్ స్టేషన్‌లో జరిగే కథ ఇది. ఆ స్టేషన్ చుట్టూ అన్ని పాత్రలూ తిరుగుతాయి. అందరికీ ప్రాముఖ్యత ఉన్న పాత్రలున్నాయి. బ్రహ్మానందంగారిది చాలా కీలకమైన వేషం. ఆయన తన పాత్రకు ప్రాణం పోశారు. బ్రహ్మాజీ పోలీస్‌గా నటించారు. ఆయన పాత్ర కూడా చాలా బాగా వచ్చింది. సుప్రీత్ మెయిన్ విలన్ ఇందులో. ఎంక్వయిరీ ఆఫీసర్‌గా బాహుబలి ప్రభాకర్ చేస్తున్నారు. మిగిలిన పాత్రలన్నీ ప్రాముఖ్యత ఉన్నవే. హాస్యాన్ని పండించేవే. సబ్జెక్ట్ లో పూర్తిగా లీనం అయిన పాత్రలే. హాస్యం, సెంటిమెంట్, సస్పెన్స్, కాస్త భయపెట్టడం... అన్నీ ఉన్న సినిమా ఇది.
బడ్జెట్, బిజినెస్ గురించి...
సినిమాను భారీ బడ్జెట్‌లోనే చేశాం. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేస్తాం. టీవీల్లో, థియేటర్లలో ట్రైలర్‌ను విడుదల చేస్తాం. ఈ మధ్య ట్రైలర్‌ను విడుదల చేసినప్పుడు ఆన్‌లైన్‌లో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అంటే మా సక్సెస్ అక్కడ వ్యూస్‌లో తెలుస్తోంది. ఇంకా హ్యాపీగా ఉంది. థియేటర్లకి వచ్చిన తర్వాత కూడా ఇదే రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నాం. అలాగే బిజినెస్ విషయానికి వస్తే చాలా మంది బయ్యర్లు అడుగుతున్నారు. కానీ మేం ఇంకా మార్కెట్ స్టార్ట్ చేయలేదు. ఇంకా విడుదల తేదీని మేం ఖరారు చేయలేదు కాబట్టి స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మే 5 అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తాం.
తదుపరి చిత్రం..
ఒక స్టార్ తో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత ఆయన్ని అప్రోచ్ అవుతాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments