'రక్షకభటుడు' అన్నీవర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది - ఎ.గురురాజ్

  • IndiaGlitz, [Saturday,May 06 2017]

నటుడుగా చిత్ర పరిశ్రమలో కెరీర్‌ను ప్రారంభించిన గురురాజ్‌ పలు చిత్రాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్‌లో నటించారు. ఓ స్పెషల్‌ ఐడెంటిటీ వుండాలనే లక్ష్యంతో రియల్‌ ఎస్టేట్‌లో వ్యాపారంలో అడుగుపెట్టి ఎన్నో అవార్డుల‌ను సాధించారు. సుఖీభ‌వ రియ‌ల్ ఎస్టేట‌ర్స్‌గా ప్ర‌జ‌ల్లో మంచి న‌మ్మ‌కాన్ని ఏర్ప‌రిచారు. ఇప్పుడు సినీ నిర్మాణ రంగంలో సుఖీభ‌వ‌ మూవీస్‌ బ్యానర్‌ను స్ధాపించి 'రక్షకభటుడు' చిత్రాన్ని నిర్మించారు. రక్ష, జక్కన్న చిత్రాలతో తనకంటూ సపరేట్‌ గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణ ఆకెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రిచా పనయ్‌, బ్రహ్మానందం, బాహుబలి ప్రభాకర్‌, బ్రహ్మాజీ, సుప్రీత్‌ ప్రధాన పాత్రల్లో న‌టించారు. ఓ స్పెషల్‌ క్యారెక్టర్‌లో ప్రముఖ హీరో నటిస్తున్నారు. ఆ హీరో ఎవరన్నది సస్పెన్స్‌గా ఉంచుతున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న రిలీజ్‌ అవుతుంది.

ఈ సందర్భంగాచిత్ర నిర్మాత ఎ.గురురాజ్‌తో సినిమా గురించి మాట్లాడారు...

నేప‌థ్యం...

ఒక బీద రైతు కుటుంబం నుండి వచ్చిన నేను నటుడి కావాలనుకుని ఇండస్ట్రీలోకి వచ్చాను. నటుడుగా పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ సమయంలో రియ‌ల్ ఎస్టేట్ రంగంలోకి వ‌చ్చి సుఖీభవ ప్రాపర్టీస్‌ని స్థాపించాను. అంచెలంచెలుగా ఎదిగిన నాకు జాతీయ అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. మా సుఖీభవ ప్రాపర్టీస్‌ ఉన్నతస్థాయిలో వుంది. సుఖీభవ మూవీస్‌ ద్వారా 'రక్షకభటుడు' చిత్రంతో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. కళామతల్లి మీద వున్న ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

ఆల‌స్యానికి కార‌ణం అదే..

ముందుగా సినిమాను ఏప్రిల్‌ 7న ఈ చిత్రం రిలీజ్‌ అనుకున్న మాట వాస్తవం. ఆన్‌లైన్‌ సెన్సార్‌ వల్ల క్లైమాక్స్‌లో గ్రాఫిక్‌ వర్క్‌ బాలెన్స్‌ ఉండడం వల్ల డిలే అయింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మే 12న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో ఈ చిత్రాన్ని మినిమమ్‌గా 500 థియేటర్స్‌లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం.

'ర‌క్ష‌క‌భ‌టుడు' మెయిన్ కాన్సెప్ట్‌..

సినిమా ప్రధానంగా అరకులోని పోలీస్‌ స్టేషన్‌ నేపథ్యంగా సాగుతుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాగే సినిమా ఇది. ఇండస్ట్రీలోని టాప్‌ కమెడియన్స్‌ అయిన బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ధనరాజ్‌, కాట్రాజు, ప్రభాకర్‌ అందరూ నటించారు. 85శాతం కామెడితో ఉంటుంది. ఈ సినిమాలో నిత్యం నేను కొలిచే నా ఆరాధ్య స్వామి ఆంజనేయ స్వామి. ఆ స్వామి కీలక పాత్రలో మా చిత్రంలో ఉండడం యాదృచ్ఛికం. ఆంజనేయస్వామి మీద చిత్రీకరించిన ముఖ్య సన్నివేశాలు మా చిత్రంలో హైలైట్‌గా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఆంజనేయస్వామి గెటప్‌లో ఎవరు నటించారు అని అడుగుతున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఎంత ఆసక్తికరంగా మారిందో మా చిత్రంలో ఆంజనేయ స్వామి ఎవరు అనేది కూడా అంతే సస్పెన్స్‌ని క్రియేట్‌ చేస్తుంది. సాధారణంగా జాతీయగీతం ఆలపించే సమయంలో అందరూ నిలుచుంటారు. కానీ రక్షకభటుడు సినిమాలో ఆడియెన్స్‌ జాతీయగీతంతో పాటు క్లైమాక్స్‌లో అన్యాయం జరిగినప్పుడు ఆంజనేయస్వామి సీన్‌కు ఆడియెన్స్‌ లేచి నిలబడతారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అయినా పూర్తిస్థాయి కామెడి ఉంటుంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. యుట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో మా చిత్ర ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. అందరి అంచనాలకు ధీటుగా ఈ చిత్రం ఉంటుంది.

డైరెక్ట‌ర్ వంశీకృష్ణ గురించి..

'రక్ష', 'జక్కన్న' చిత్రాలతో డిఫరెంట్‌ ఫిలింస్‌ చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న స్టైలిష్‌ ఫాంటసీ చిత్రంగా 'రక్షకభటుడు' చిత్రాన్ని రూపొందించారు. ఇంతవరకూ ఎకక్కడా రాని డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వంశీకృష్ణ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. గ్యారెంటీగా ఈ చిత్రం అందర్నీ అలరిస్తుంది. ఫస్ట్‌ వంశీ కథ చెప్పినప్పుడు స్మాల్‌ బడ్జెట్‌లో తీద్దాం అన్నాడు. కథ డిమాండ్‌ మేరకు క్వాలిటీ విషయంలో ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని తీయ‌మ‌ని అన్నాను. అన్న‌ట్లుగానే సినిమాను గ్రాండ్‌గా తీశాం. గ్రాఫిక్‌ వర్క్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ వుండటంతో అనుకున్నదాని కన్నా బడ్జెట్‌ రెండింతలు పెరిగింది. పోలీస్‌ స్టేషన్‌లోనే మెయిన్‌ కథ జరుగుతుంది.

పాత్రల గురించి..

మా చిత్రంలో ఆంజనేయ స్వామి క్యారెక్టర్‌లో ఓ ప్రముఖ హీరో నటించారు. అలాగే బ్రహ్మానందం, బ్రహ్మాజీ, బాహుబలి ప్రభాకర్‌, సుప్రీత్‌, సంపూర్ణేష్‌ బాబు, నందు, రీచపనయ్‌ మెయిన్‌ క్యారెక్టర్‌లో నటించారు. కథే మా చిత్రంలో హీరో. హండ్రెడ్‌ పర్సెంట్‌ ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది. నవ్విస్తుంది. మరికొన్ని ఎమోషన్‌ సీన్స్‌లో ఏడిపిస్తుంది.రిచా ప‌న‌య్ మెయిన్‌, ఆమె క్యారెక్టర్‌ చుట్టూ కథ జరుగుతుంది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఓ ప్రాబ్లెమ్‌లో పడి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తుంది. అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మెయిన్‌ కథాంశం.

నెక్ట్స్ మూవీ...

మా బ్యాన‌ర్‌లో నెక్ట్స్ మూవీని కూడా ఓ స్టార్ హీరోతోనే చేయాల‌నుకుంటున్నాం. త్వ‌ర‌లోనే వివ‌రాల‌ను తెలియ‌జేస్తాను.

More News

దిల్ రాజు, నేచురల్ స్టార్ నాని, శ్రీరామ్ వేణు కాంబినేషన్ లో కొత్త చిత్రం 'ఎంసిఎ' ప్రారంభం

డబుల్ హ్యాట్రిక్ హీరో నేచురల్ స్టార్ నాని హీరో,హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో

హ్యాట్రిక్ కోసం జత కడుతున్నారు..

మాస్ మహారాజా రవితేజ,డైరెక్టర్ గోపీచంద్ మలినేనిది హిట్ కాంబినేషన్.

సైకాలాజికల్ థ్రిల్లర్ '9' మూవీ టీజర్ విడుదల

ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్ ప్రై.లి.బ్యానర్ పై అతుల్ కులకర్ణి,కబీర్ దుహన్ సింగ్,అర్చన శాస్త్రి,ఆషిమా నర్వాల్,శ్రిత చందన,

'లండన్ బాబులు' ఫస్ట్ లుక్

ఎప్పిటికప్పుడు మంచి కాన్సెప్ట్ లతో లిమిటెడ్ బడ్జెట్ లో క్వాలిటిగా చిత్రాలను నిర్మిస్తున్న మారుతి టాకీస్,ఎవిఎస్ స్టూడియోస్ సమర్పణలో

గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్' ట్రైలర్ విడుదల

యాక్షన్ హీరో గోపీచంద్-సెన్సేషనల్ డైరెక్టర్ బి.గోపాల్ ల కాంబినేషన్ లో జయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న భారీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్" చిత్రం ట్రైలర్ ను నేడు (మే 5న) చిత్ర బృందం విడుదల చేసింది.