'ఆర్ఎక్స్ 100'ను మించి 'రాజావిక్రమార్క' బ్లాక్‌బస్టర్ అవుతుంది - నిర్మాత '88' రామారెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాలపై ప్యాషన్‌తో గ్రామీణ నేపథ్యం నుండి తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చిన నిర్మాతలు కొందరు ఉన్నారు. ఘనవిజయాలు అందుకున్నారు. ఈ బాటలో వస్తున్న నిర్మాత '88' రామారెడ్డి. యువ హీరో కార్తికేయ గుమ్మకొండతో ఆయన 'రాజా విక్రమార్క' సినిమా నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆయనకు తొలి చిత్రమిది. ఈ శుక్రవారం (ఆగస్టు 20న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా '88' రామారెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఇవీ...
హ్యాపీ బర్త్‌డే రామారెడ్డిగారు!
థాంక్యూ అండీ. థాంక్యూ! తొలిసారి మీడియా మిత్రుల ముందుకు రావడం సంతోషంగా ఉంది.
మీది ఏ ఊరు, నేపథ్యం ఏమిటి?
మాది తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు మండలంలో గల కొంకుదురు గ్రామం. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డిగారిది మా ఊరే. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు ఉన్నాయి.
వ్యాపారం నుంచి సినిమాల్లోకి ఎలా వచ్చారు?
వినోద్ రెడ్డిగారు అని ఓ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. ఆయనది మా ఊరు. సుమారు రెండొందల సినిమాల వరకూ డిస్ట్రిబ్యూషన్ చేశారు. కొన్ని సినిమాలు సొంతంగా విడుదల చేశారు. వినోద్ రెడ్డి నాకు ఫ్రెండ్. ఆయన ద్వారా సినిమాల్లోకి వచ్చాను. నిర్మాతగా 'రాజా విక్రమార్క' నా తొలి సినిమా.
'రాజా విక్రమార్క' ఎలా మొదలైంది?
సినిమా నిర్మించాలని అనుకుంటున్నప్పుడు... వినోద్ రెడ్డి దగ్గరకు 'రాజా విక్రమార్క' కథ వచ్చింది. ఆయనతో పరిచయం ఉండటంతో మాటల మధ్యలో ఈ కథ గురించి చెప్పారు. నాకు బాగా నచ్చింది. సినిమా చేయాలని ఉందని చెప్పాను. తర్వాత ఆదిరెడ్డిగారితో కలిసి సినిమా స్టార్ట్ చేశాం. అలా వినోద్ రెడ్డి దగ్గర నుండి మా దగ్గరకు సినిమా వచ్చింది.
సినిమా ఎలా ఉండబోతోంది?
ఇది యాక్షన్ ఎంటర్టైనర్. హీరో కార్తికేయ ఎన్ఐఏ అధికారిగా కనిపిస్తారు. సినిమాలో వినోదం, ప్రేమ కూడా ఉంటాయి. ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్టైనర్ ప్యాకేజ్. '90 ఎంఎల్' చేస్తున్నప్పుడు హీరోగారితో పరిచయం ఏర్పడింది. ఆ సినిమా తర్వాత చేయాలని అనుకున్నాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments